విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
Published on Wed, 03/04/2026 - 17:51
ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. అయితే శ్యామల ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, కనీస మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి స్టార్ హీరో అల్లు అర్జున్ స్పందించాడు.
ఒక అడుగు ముందుకేసి..
శ్యామల, ఆమె కూతురి నిత్యావసరాలు, వైద్యఖర్చుల నిమిత్తం నెలకు రూ.10 వేలప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ డబ్బు ఆమెకు అందేలా శాశ్వత ఏర్పాట్లు చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. గతంలో పలువురు సెలబ్రిటీలు పావలా శ్యామలకు సాయం చేశారు. అయితే బన్నీ ఒక అడుగు ముందుకేసి తాత్కాలిక సాయం కాకుండా శాశ్వతంగా ప్రతి నెల ఫిక్స్‌డ్ అమౌంట్ పంపేందుకు చర్యలు తీసుకోవడం విశేషం!
Tags : 1