విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
అత్యంత విషపూరితమైన పాయిజన్‌తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!
Published on Wed, 03/04/2026 - 13:01
పాములను భయానకంగా మార్చేది ఏమిటంటే, కొన్ని విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చంపే సామర్థ్యం. కానీ విషపూరిత కాటుకు తెలిసిన ఏకైక విరుగుడు, యాంటీవెనమ్, అదే విషంతో తయారు చేయబడింది. శతాబ్దాలుగా,పాము విషంలోని ఎంజైమ్‌ల మిశ్రమంలో వివిధ రకాల ఔషధాలు కూడా ఉండొచ్చని మానవుడు ఏనాడో గుర్తించాడు.
ఈ క్రమంలోనే విషం నుంచి తయారు చేసిన ఆధునిక చికిత్సా ఉత్పత్తులు నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్తాన్ని ప్రభావితం చేసే వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. ఈ పాముల విషాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేలా లక్ష్యంగా పెట్టుకుని మరి మందులు రూపొందించారు వైద్య నిపుణులు.
అవేంటంటే రక్తపోటు , పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేసే కాప్టోప్రిల్ జరారాకా (దీన్ని దక్షిణ అమెరికా పిట్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము నుంచి తయారు చేస్తారట), అస్వస్థతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఎప్టిఫిబాటైడ్ (రాటిల్ స్నేక్ నుంచి తయారు చేస్తారు). ఇవేగాక కింగ్‌కోబ్రా విషంపై పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇందులో కూడా అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. దీని విషాన్ని హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించే బీటా-కార్డియోటాక్సిన్ ఔషధ తయారీలో ఇనియోగిస్తారట. అలాగే పెప్టైడ్‌ను నోటి ద్వారా తీసుకునే మందుని కూడా తయారు చేస్తారట.
కేవలం పాముల నుంచే కాదు అవి కూడా..
విషాన్ని ఉత్పత్తి చేసే జీవులు పాములు మాత్రమే కాదు. గొంగళి పురుగులు,కందిరీగలు, కోన్ నత్తల నుంచి టోడ్లు, జెల్లీ ఫిష్ వరకు వివిధ రకాల జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అఖరికి కొన్ని బల్లులు కూడా విషపూరితమైనవేనని చెబుతున్నారు నిపుణులు. మనం తరుచుగా పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం కింద అందించే భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు అని వింటుంటాం. అందుకు కారణం అన్నం లేదా కూరలో బల్లి పడటంతో ఇది జరిగిందని చెబుతుంటారు.
అంటే సాధారణంగా బల్లలు విషపూరితమైనవి కావు, కానీ మనం తినే పదార్థాల్లో పడినప్పుడు దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రేగుల్లో చేరి పాయిజన్ అవుతుందట. అంతేకాదండోయ్ అమెరికా, మెక్సికో ఎడారులలో కనిపించే గిలా అనే బల్లి విషం నుంచి టైప్ 2 డయాబెటిస్ నివారణ మందును తయారు చేస్తారట. అంతేగాదు అంతకుమించి ప్రమాదకరమైన మరో చిన్నజీవి ఉంది. మనం తరుచుగా ఇళ్లల్లో చూసేదే. అదేనండి గొంగళి పురుగు. దక్షిణ అమెరికాలోని లోనోమియా గొంగళి పురుగు అత్యంత ప్రాణాంతకమైనదట.
1989లోబ్రెటిజల్లో వీటిని చూశారట. ఇవి సముహాలుగా గుత్తులగా ఉంటాయట. ఒక గుత్తిని తాకినా..అంతే ప్రాణాలే పోతాయట. అందుకు పెరూలోనే ఓ రోగి కేసు ఉదాహరణ అంటున్నారు వైద్య నిపుణులు. పెరూలో ఐదు గొంగళి పురుగులపై కాలు వేసిన ఒక యువ కెనడియన్ పర్యాటకుడి ప్రారంభంలో కొద్దిపాటి లక్షణాలు అనుభవించిన..రోజులు గడుస్తున్నకొద్ది బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ గొంగళి పురుగు విషం శాస్త్రవేత్తల పరిశోధనలో అంతర్గత రక్తస్రావం, మూత్రపిండ వైఫల్యానికి దాదితీస్తుందని తర్వాత తెలిసింది.
దీనికి విరుగుడు బ్రెజిల్‌లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ తయారు చేసిన యాంటీవినమ్ మాత్రమే చికిత్స. ఇక సాలీడు విషం సైతం మానవులకు ఉపయోగపడుతుందట. ప్రపంచంలోని నాలుగు ప్రాణాంతక సాలెపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియాలోని గరాటు వెబ్ అనే సాలీడు విషం నుంచి సహజ పురుగుల మందు నివారిణిని తయారు చేస్తున్నారు. ఇది దోమలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందట. అలాగే ఇది డీడీటీ వంటి ఇతర పురుగుమందుల నిరోధకతను కూడా కలిగి ఉందట. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో పాము విషం వాడకాన్ని ప్రోత్సహిస్తోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలలు అనుభవించిన ఉపశమనం ఆధారంగా తేలు విషాన్ని చికిత్సలో ఉపయోగించారు.
అంతేగాదు ఈ తేలు విషం ఒంటి నొప్పులకు నివారణగా కూడా ఉపయోగిస్తారట. అలాగే సముద్ర ఎనిమోన్ల ద్వారా ఉత్పత్తి చేసే టాక్సిన్లను ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారట. పురాత గ్రీకులు ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టారు. పైగా రాబోయే ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని ఆనాడే అంచనా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు చాలామటుకు తమ చిహ్నంగా సిబ్బంది చుట్టుతా చుట్టబడిన పాము నమునాని ఎంచుకోడానికి రీజనే ఇదే కావొచ్చు కూడా.
జానికి లెనిన్
(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు)
Tags : 1