విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
హర్మోన్లు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయంటే..!
Published on Tue, 03/03/2026 - 07:10
పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. అది మీ శరీరంలో జరిగే Chemistry కూడా. చాలామంది తమ కోపానికి, బద్ధకానికి, ఆందోళనకు కారణం 'చేతకానితనం' అనుకుంటారు. కానీ, అది కేవలం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులు మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మనం ఒక వ్యక్తిని "కోపిష్టి" అంటాం, లేదా "చాలా ప్రశాంతమైన వ్యక్తి" అంటాం. కానీ ఒక వ్యక్తి మెదడులో నిరంతరం జరిగే రసాయన చర్యలే ఆ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ హార్మోన్లు మీ కళ్ళకు కనిపించవు కానీ, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా ఆలోచించాలో అవే నిర్ణయిస్తాయి.
1. The Fantastic Four...
మన ప్రవర్తనను ప్రధానంగా నాలుగు హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. వీటిని మనం 'హ్యాపీ హార్మోన్లు' అని పిలుస్తాం.
Dopamine - The Reward Molecule: మీరు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు విడుదలవుతుంది. ఇది లేకపోతే మీరు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు.
Serotonin - The Mood Stabilizer: ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక హోదాను నియంత్రిస్తుంది. ఇది తక్కువైతే వ్యక్తి డిప్రెషన్‌లోకి వెళ్లడం, విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతుంది.
Oxytocin - The Bonding Hormone: ఇది మనుషులతో మనల్ని కలిపి ఉంచుతుంది. ఇది ఎక్కువ ఉంటే మీరు నలుగురితో కలిసిపోయి ఉంటారు, తక్కువ ఉంటే ఒంటరితనం (Loneliness) ఫీలవుతారు.
Endorphins - The Pain Killer: ఇవి ఒత్తిడిని, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.
2. కార్టిసాల్: మీ పర్సనాలిటీకి శత్రువు
మీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) విడుదలవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే, మీ మెదడులోని 'హిప్పోకాంపస్' (జ్ఞాపకశక్తికి సంబంధించింది) బలహీనపడుతుంది. దీనివల్ల మీరు త్వరగా మర్చిపోవడం, కోపపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం జరుగుతుంది. మీరు చేస్తున్న 'ట్రిగ్గర్' పనులన్నీ ఈ కార్టిసాల్ ని పెంచేవే!
3. మోటివేషన్ vs బయోలాజికల్ ఫ్యాక్ట్స్
సో-కాల్డ్ ట్రైనర్లు "నీ మైండ్ సెట్ మార్చుకో, అంతా మారుతుంది" అని చెప్తారు. అది నిజమే, కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి.
మీరు రోజుకు 30 నిమిషాలు ఎండలో తిరగకపోతే, లేదా వ్యాయామం చేయకపోతే.. మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా, మీ బయోలజీ మీకు సహకరించదు.
4. బయోలాజికల్ రీ-ప్రోగ్రామింగ్
Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ హార్మోన్లను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు?
Step 1: శారీరక అడ్డంకులను బ్రేక్ చేయండి
మీరు బద్ధకంతో ఉన్నప్పుడు "నేను సోమరిపోతుని" అని అనుకోవద్దు. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, నిద్ర లేవేమో అని విశ్లేషించండి. మీ బయోలాజికల్ సైకిల్ ని 'Break' చేసి, సరైన నిద్ర, ఆహారం వైపు అడుగు వేయండి.
Step 2: హార్మోనల్ హ్యాకింగ్
Dopamine Detox: సోషల్ మీడియా లైకుల ద్వారా వచ్చే తక్షణ డోపమైన్‌ని ఆపేసి, కష్టపడి ఏదైనా పని చేయడం ద్వారా వచ్చే డోపమైన్‌ని అలవాటు చేసుకోండి.
Oxytocin Boost: తోటి మనుషులతో కనెక్ట్ అవ్వండి, ఇది మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది.
Step 3: బయో-మాస్టరీ
ఒక్కసారి మీ శరీరంలోని రసాయన శాస్త్రం మీకు అర్థమైతే, మీరు ఒక మాస్టర్ లా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో మీ హార్మోన్ల ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోగలరు.
5. మీ హార్మోన్ల చెకప్
ఈ రోజు మీరు ఈ చిన్న గమనికను గమనించండి.
ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (ఉత్సాహమా లేక బద్ధకమా?) - ఇది మీ నిద్ర నాణ్యత మరియు డోపమైన్ లెవెల్స్ ని చెప్తుంది.
సాయంత్రం వేళల్లో మీకు ఒత్తిడిగా అనిపిస్తుందా? - ఇది మీ కార్టిసాల్ లెవెల్స్ ని చూపిస్తుంది.
మీరు ఫిజికల్ యాక్టివిటీ (వ్యాయామం) చేస్తున్నారా? - లేకపోతే మీ ఎండార్ఫిన్లు పని చేయడం లేదని అర్థం.
మీ శరీరం మీ దేవాలయం!
బ్రో, వ్యక్తిత్వం అంటే కేవలం మీ ఆలోచనలే కాదు, మీ శరీరం కూడా. మీరు మీ హార్మోన్లను పట్టించుకోకుండా, కేవలం మైండ్‌సెట్ మీద పనిచేస్తే అది పక్షవాతం ఉన్న వ్యక్తికి పరిగెత్తమని చెప్పినట్లే ఉంటుంది. మీ శరీరాన్ని సరిగ్గా చూసుకోండి, అప్పుడు మీ మైండ్ మీకు మద్దతు ఇస్తుంది.
"A healthy mind needs a healthy chemistry."
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com
Tags : 1