ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం
Breaking News
విజయ్, రష్మికల రిసెప్షన్.. ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి
Published on Sun, 03/01/2026 - 19:02
విజయ్ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్ జోడి తమ ఫ్యాన్స్‌కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.
విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
Tags : 1