ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం
Breaking News
'రణబాలి' పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ: దర్శకుడు
Published on Sun, 03/01/2026 - 15:15
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందర్భంగా రణబాలి నుంచి ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అయింది. పోస్టర్‌లో వారిద్దరి లుక్ చాలా ఓల్డ్ గెటప్‌లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దీని వెనుక దాగిన ఆసక్తికరమైన స్టోరీని చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ షేర్ చేశారు. రణబాలి నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కేవలం ఒక సినిమాకు సంబంధించినది మాత్రమే కాదని తెలిపారు. ఈ పోస్టర్ రూపకల్పనలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు.
పాత కాలపు ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మన పూర్వీకులు కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన ఫోజులు లేకుండా చాలా సహజంగా ఫోటోలు దిగేవారని చెప్పారు. అలాంటి కృత్రిమమైన లుక్‌ను రణబాలి పోస్టర్‌లో తీసుకురావాలని తాము ప్రయత్నించినట్లు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు.
రణబాలి పోస్టర్ గురించి దర్శకుడు ఇలా చెప్పారు. '1800ల కాలం నాటి నేపథ్యంలో ‘రణబాలి’ మూవీ ఉండనుంది. కాబట్టి, ఆ కాలపు గాంభీర్యం, మట్టి వాసన కనిపించేలా ఈ చిత్రంలో వివాహ వేడుకను డిజైన్ చేశాం. ఈ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చినప్పుడు వారిద్దరూ నిజంగానే మన పూర్వపు కాలంలోకి వెళ్ళిన వ్యక్తుల్లా కనిపించారు. ఫోటో లుక్‌లో కూడా వారిద్దరూ ఎలాంటి స్టైలిష్ ఫోజులు ఇవ్వలేదు. కేవలం సాధారణ వ్యక్తుల్లా వారిద్దరినీ కెమెరాతో బంధించాం. ఇదే ఈ పోస్టర్ ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్ విడుదల నాటికి వారిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయ్. ఈ పోస్టర్ చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది.' అని రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు.
STORY BEHIND THE WEDDING POSTER
Yesterday, we released the wedding poster of Ranabaali.
But this wasn’t designed as a “poster.” It was a moment.
I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026
Tags : 1