ఇరాన్ కు అంత బలముందా.. ప్రపంచంపై యుద్ధం ప్రభావం ఏంటి?
Breaking News
పాత ఫోన్‌కు కొత్త కవర్..మంచి మాట చెప్పిన మంచు మనోజ్
Published on Sat, 02/28/2026 - 17:48
మంచు మనోజ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటాడు. చాలా ఓపెన్‌గా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. తన చేష్టలు, మాటలతో చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తుంటాడు. కానీ తాజాగా అయన అందరికీ ఓ మంచి సందేశం ఇచ్చాడు. మెప్పు కోసం అప్పులు చేయొద్దదంటూ యువతకు విలువైన సలహా ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ యూనవివర్సీటీలో జరిగిన ఈవెంట్‌కు అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందని.. వాడే వస్తువుల వల్ల రాదని చెప్పారు.
పాతఫోన్కు కొత్త కవర్
ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నాడు. అదేంటంటే.. మనోజ్ ఇప్పటికీ పాత ఐఫోన్‌నే వాడుతున్నాడు.కానీ దానికి iPhone 17 Pro Max కవర్ వేసి మ్యానేజ్ చేస్తున్నాడు. ఆ ఫోన్‌ను చూపిస్తూ.. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచించారు. డబ్బు వృథా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.
మనోజ్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో మనోజ్ బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు.
Actor Manchu Manoj advised youth not to take loans just to impress others. Speaking at an event, he said he uses his old iPhone with an iPhone 17 Pro Max cover, urging students to avoid unnecessary luxury spending and be content with what they have.#ManchuManoj pic.twitter.com/wNOz2NF4yE
— Telangana Ahead (@telanganaahead) February 28, 2026
Tags : 1