Breaking News

బడ్జెట్‌లో మెరిసే ఇంటీరియర్..

Published on Sun, 03/01/2026 - 07:00

మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక భావోద్వేగం. అయితే, మారుతున్న కాలంతో పాటు నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇల్లు కట్టడమే కాకుండా, నివసించడానికి యోగ్యంగా మార్చే ఇంటీరియర్ డెకరేషన్ కోసం అదనంగా లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన ప్రణాళిక, మెటీరియల్ ఎంపికలో మెలకువలు పాటిస్తే.. తక్కువ బడ్జెట్‌లోనే మీ ఇంటిని ఒక ప్యాలెస్‌లా మార్చుకోవచ్చని ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటీరియర్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

హాల్ (లివింగ్ రూమ్)

ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేది హాల్. ఇక్కడ ఖర్చు తగ్గించి లుక్ పెంచడానికి మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్ ఉత్తమ మార్గం. గోడలకు ఖరీదైన టెక్స్చర్ పెయింట్‌లకు బదులుగా ఒక గోడకు మాత్రమే యాక్సెంట్ కలర్ లేదా తక్కువ ధరలో దొరికే పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ వాడవచ్చు. లైటింగ్‌కు సంబంధించి ఫాల్స్ సీలింగ్ కోసం భారీగా ఖర్చు చేసే బదులు కోవ్ లైటింగ్ లేదా స్టైలిష్ ఎల్‌ఈడీ స్ట్రిప్స్‌తో మంచి లుక్ తీసుకురావచ్చు.

వంటగది

వంటగదిలో మాడ్యులర్ కిచెన్ పేరుతో భారీగా ఖర్చు అవుతుంది. ఖరీదైన ప్లైవుడ్‌కు బదులుగా డబ్ల్యూపీసీ (Wood Polymer Composite) బోర్డులను వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా చెదలు పట్టకుండా ఉంటుంది. స్టోరేజ్ కోసం పైన ఉండే క్యాబినెట్లకు తలుపులు పెట్టకుండా ఓపెన్ షెల్వింగ్ పద్ధతిని పాటిస్తే మెటీరియల్ ఖర్చు తగ్గుతుంది. ఇది వంటగది విశాలంగా కనిపించేలా చేస్తుంది.

బెడ్‌రూమ్

అల్యూమినియం సెక్షన్లతో కూడిన వార్డ్‌రోబ్స్ లేదా స్లైడింగ్ డోర్ కబోర్డులు స్థలాన్ని ఆదా చేస్తాయి. లామినేట్ షీట్ల ఎంపికలో లేటెస్ట్ మ్యాట్ ఫినిష్ ఎంచుకుంటే తక్కువ ధరలో లగ్జరీ లుక్ వస్తుంది. స్టోరేజ్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఎంచుకోవడం వల్ల అదనపు అల్మారాల అవసరం ఉండదు.

వాష్‌రూమ్, క్యారిడార్

బాత్రూమ్ గోడల మొత్తానికి టైల్స్ వేయకుండా కేవలం 7 అడుగుల ఎత్తు వరకు వేసి పైన పెయింట్ వేయడం ద్వారా 20 శాతం వరకు ఖర్చు తగ్గించవచ్చు. బ్రాండెడ్ ఫిట్టింగ్స్‌లో ఎంట్రీ లెవల్ సిరీస్‌లను ఎంచుకోండి. ఇవి క్వాలిటీతో పాటు వారంటీని ఇస్తాయి. క్యారిడార్‌లో రేయిలింగ్‌ కోసం అద్దాలను అమర్చడం వల్ల ఇరుకైన క్యారిడార్లు కూడా విశాలంగా కనిపిస్తాయి.

బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే..

ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందే ఇంటీరియర్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. వైరింగ్, ప్లంబింగ్ పాయింట్లు ముందుగానే నిర్ణయించుకుంటే తర్వాత చేసే మార్పుల వల్ల అయ్యే వృధా ఖర్చును నివారించవచ్చు.

ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

Videos

రేవంత్ తో చంద్రబాబు కుమ్మక్కు.. రాయలసీమ ప్రాజెక్టుపై సజ్జల డిమాండ్స్

ఖమేనీ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్

పులకేష్ ని మైమరిపిస్తున్న లోకేష్

BR నాయుడు 30 ఏళ్ల బంధం చాలా బలమైనది: పేర్ని నాని

మియాపూర్ లో అపోలో ఫార్మసీ 1000వ స్టోర్‌ ను ప్రారంభించిన ఉపాసన

సాక్షి మీడియాకి సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

దుబాయ్ లో బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా మీదుగా ఇరాన్ మిస్సైల్స్

రాష్ట్ర ప్రజల్ని రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పడేసాడు..

30 ఏళ్ల పరిచయం.. తప్పు ఒప్పుకున్న BR నాయుడు !

ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)

+5

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)

+5

శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)

+5

ఇరాన్‌: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)

+5

మహిళ కబడ్డీ మూవీ ప్రెస్‌ మీట్ (ఫొటోలు)

+5

విష్ణు విన్యాసం మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సన్‌ ఆఫ్‌ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)

+5

లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)