అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్
Breaking News
అమ్మో.. రుక్మిణినా?.. భయపడిపోతున్న దర్శకనిర్మాతలు!
Published on Fri, 02/27/2026 - 08:02
ఈ తరం హీరోయిన్లు నటనపై కంటే ధనార్జన పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అలా అవకాశాలను కోల్పోతున్నారా ? నటి రుక్మిణి వసంత్ లాంటి నటీమణులను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ కన్నడ భామ సినీ పయనం జస్ట్ ఆరేళ్లే. అయితే ఈ అమ్మడు ఇంత తక్కువ కాలంలోనే పాన్ ఇండియా కథానాయకిగా మారడం విశేషమే.
2019లో ఒక కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తాజాగా తెలుగు భాషల్లో చిత్రాలు చేశారు. ఇటీవల కన్నడం చిత్రం కాంతార –2లో నటించి విశేష గుర్తింపును పొందారు. పారితోషికం పెంచాలంటే ఎవరైనా, మంచి విజయం కోసం ఎదురు చూడాలి. అలాంటి హిట్ రుక్మిణి వసంత్‌కు కాంతారా– 2 చిత్రంతో వచ్చింది. తాజాగా ఓ తెలుగు, కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇంతకు ముందు విజయ్ సేతుపతికి జంటగా ఏస్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది.
అదే విధంగా తెలుగులోనూ రంగప్రవేశం చేశారు. అక్కడ నటించిన తొలి చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం విజయాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి లక్కు ఉన్నట్లుంది ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వరించింది.
ఇకపోతే కన్నడంలో యశ్‌తో కలిసి నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ అమ్మడి చేతిలో డ్రాగన్ అనే ఒక్క చిత్రం మాత్రమే ఉంది. కొత్తగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం వల్లే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపిక చేయడానికి వెనుకడుగు వేస్తున్నారట. రుక్మిణి వసంత్ ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 12 చిత్రాలు మాత్రమే చేశారు. అప్పుడే కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తుండడం చర్చనీయాశంగా మారుతోంది.
Tags : 1