Breaking News

గాసిప్‌ మా బలం

Published on Fri, 02/27/2026 - 06:09

స్త్రీలు గాసిప్‌ మాట్లాడుకుంటూ ఉంటారనే ఒక ప్రచారం ఉంటుంది. ఆడవాళ్ల కబుర్ల కింద వీటిని కొట్టేస్తూ ఉంటారు. కాని ‘గాసిప్‌’ స్త్రీల స్నేహానికి ఒక వారధి అని,  స్త్రీలు ఒకరితో మరొకరు చెప్పుకునే ఈ కబుర్లే పురుషుడి పెత్తనం నుంచి బయట పడేసే ఓదార్పు అని అంటున్నారు అంజలీ కృష్ణదాస్‌. కేరళకు చెందిన ఈ రంగస్థల నటి మరో ఇద్దరు నటీమణులతో కలిసి ప్రచారం చేస్తున్న ‘గాసిప్‌’ నాటకం స్త్రీల స్నేహాలపై కొత్త దృష్టిని కలిగిస్తోంది.

అర్థవంతమైన మాటలు, దేశాన్ని ఉద్దరించే మాటలు మగవాళ్లు మాట్లాడుకుంటారట... ఆడవాళ్లు ఉత్త పోచికోలు కబుర్లు చెప్పుకుంటారట. అలా అని ఎవరన్నారు? మగాళ్లే. ఆడవాళ్ల మాటలకు అర్థాలు ఉంటాయని, ఆడవాళ్ల మాటల్లో ఆలోచనలు ఉంటాయని వారికి తెలుసునా?
‘తెలియ చేయాలి’ అంటారు అంజలి కృష్ణదాస్‌. 

ఈమె ‘కొచ్చి’కి చెందిన క్లాసికల్‌ డాన్సర్‌. మరో క్లాసికల్‌ డాన్సర్‌ పొన్ను సజీవ్‌తో కలిసి అక్కడ ‘తుడిప్పు డాన్స్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థను నడుపుతున్నారు. తన సంస్థ ద్వారా అందరూ స్త్రీలే భాగస్వామ్యం వహించేలా ఒక నాటకం వేయాలని అనుకున్నప్పుడు ఆమె దృష్టికి వచ్చిన వస్తువు ‘గాసిప్‌’. దీనికి సరైన తెలుగు మాట లేదు. గుసగుసలు, కబుర్లు, చాడీలు, పుకార్లు... అన్నీ కలిపితే గాసిప్‌. ఆడవాళ్లు ‘గాసిప్‌’ ఎందుకు మాట్లాడతారు? వాళ్లు మాట్లాడేదంతా గాసిప్పేనా? ఆ సంగతి చర్చించడానికే 45 నిమిషాల ‘గాసిప్‌’ అనే డాన్స్‌ డ్రామా సృష్టించారు అంజలి కృష్ణదాస్, పొన్ను సజీవ్‌.

గాసిప్‌కు మూలం ఏమిటి?
‘గాసిప్‌’ ఇంగ్లిష్‌ మాటకు మూలం గాడ్‌సిబ్‌. పూర్వం నెలలు నిండిన స్త్రీలు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్లు వాళ్లు బయటకు రావడానికి వీలుండదు. మరి ఇంట్లో అలాగే మగ్గితే విసుగెత్తి పోతారు. అందుకే ఆ సమయంలో నమ్మకంగా ఇంటికొచ్చి ఇరుగూ పొరుగున ఏం జరుగుతుందో చెప్పే స్నేహితురాళ్లను గాడ్‌సిబ్‌ అనేవారు. నెమ్మదిగా ఆ మాట నుంచి గాసిప్‌ పుట్టింది. ‘గాసిప్‌ను కాలక్రమంలో చెడ్డ మాటను చేశారు. కాని అది స్త్రీల మధ్య స్నేహానికి సంబంధించిన పదం. ఆ పూర్వపు మర్యాద ఆ పదానికి తీసుకురావడమే మా ప్రయత్నం’ అన్నారు అంజలీ కృష్ణదాస్‌.

బూట్లూ– హైహీల్సూ
‘గాసిప్‌’ నాటకంలో చాలాచోట్ల మగవాళ్ల బూట్లు ప్రదర్శిస్తారు నటీమణులు. ‘హీరో బూట్ల మీదే షాట్‌ ఓపెన్‌ చేస్తారు ఎందుకు? బూట్లు అధికారానికి, పురుష స్వామ్యానికి, పీడనకి గుర్తు. ఈ సినిమాలో బూట్ల బరువును ఆడవాళ్లు తోటి ఆడవాళ్ల సాయం, మాట సాయం వల్లే మోస్తారు. ఆఖరున వారు బూట్ల రాసి మధ్యన తమ హైహీల్స్‌ బయటకు తీయడంతో నాటకం ముగుస్తుంది’ అంటారు అంజలి.
‘గాసిప్‌’ నాటకానికి విశేష ఆదరణ లభిస్తున్నదంటే విచిత్రం ఏముంది. స్త్రీలు చేసే కొత్త ఆలోచనలకు ఎప్పుడూ ప్రశంసలే కదా.
 

అపాయంలో ఉపాయం
స్త్రీలు గాసిప్‌ మాట్లాడని చోటు ఉండదు. వంటిగది, బ్యూటీ సెలూన్, రేషన్‌ షాప్, వీధి మలుపు, ఇంటి పిట్టగోడ... ఈ పిట్టగోడ మీద అనేక కార్టూన్లు కూడా ఉన్నాయి. ‘కాని స్త్రీల కబుర్లన్నీ వారు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే వొత్తిడిని, పురుషుల పెత్తనాన్ని దూరం చేసేవే. వారు సాటి స్త్రీలతో మాట్లాడి సలహాలు తీసుకుంటారు, సూచనలు అందుకుంటారు, అపాయాల్లో ఉంటే ఉపాయాలు తెలుసుకుంటారు... పురుషుణ్ణి ఎదుర్కొనడమే వీటన్నింటి లక్ష్యం. తరతరాలుగా గాసిప్‌ మాట్లాడుతూ స్త్రీలు తమ నిత్య జీవితంలోని ఘర్షణలను దాటుతున్నారు’ అంటారు ‘గాసిప్‌’ రూపకర్తలు.

Videos

మొదటి సారి సీఎం అయినప్పుడు అసెంబ్లీలో ఎవ్వరికి తెలియని పచ్చి నిజం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

పెళ్లి సీజన్‌లో ఊరట.. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గింపు

లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ కన్నీళ్లు పెట్టుకున్న కేజీవాల్

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ

చిలుకూరులో విషాదం ఆలయ ప్రధాన అర్చకులు ఇకలేరు

అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్

కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Mangalagiri : జనసేన ఆఫీస్ లో దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Health Condition : తన ఆరోగ్యంపై బొత్స క్లారిటీ

Photos

+5

జాలీగా గడిపేస్తున్న మెహరీన్‌ (ఫోటోలు)

+5

పిల్లాడే కాదు, మేమూ మిస్‌ అవుతాం: కాజల్‌ (ఫోటోలు)

+5

బ్లాక్‌ చీరలో నటి నివేథా థామస్.. గ్లామ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్‌

+5

ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫొటోలు)

+5

ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)