వసూళ్లు చూసి ధైర్యం వచ్చింది: సుహాస్‌

Published on Fri, 02/27/2026 - 00:49

‘‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్‌ నంబర్లు కూడా కనబడకపోవడంతో భయం వేసింది. కానీ, ‘హే బల్‌వంత్‌’ మూవీ వసూళ్లు చూశాక ధైర్యం వచ్చింది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి’’ అని హీరో సుహాస్‌ పేర్కొన్నారు. గోపీ అచ్చెర దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన చిత్రం ‘హే బల్‌వంత్‌’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 20న విడుదల చేశారు. గురువారం నిర్వహించిన ‘థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌’లో బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో వచ్చిన తొలి సక్సెస్‌ ఇది. మంచి సినిమా తీశారంటూ ప్రేక్షకులు అభినందించడం సంతృప్తినిచ్చింది’’ అని తెలిపారు.

‘‘మా మూవీ చూసిన అందరూ యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు గోపీ అచ్చెర. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘హే బల్‌వంత్‌’కి బ్రేక్‌ ఈవెన్‌ కావడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాని దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్‌ ఇతర హక్కులు, థియేటర్స్‌ కలెక్షన్స్‌ అన్నీ కలిపి పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. 

రానున్న రోజుల్లో లాభాల్లోకి వెళతాం. నంది అవార్డ్స్‌ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్‌ గురించి నేను ఈ మధ్య తప్పుగా మాట్లాడాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐయామ్‌ సారీ’’ అని చెప్పారు. నటి, యాంకర్‌ స్రవంతి చొక్కారపు, లావణ్య రెడ్డి, మహీ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.

Videos

షణ్ముఖ్ జస్వంత్ మరియు వైష్ణవి చోడిశెట్టి ఎంగేజ్‌మెంట్ వీడియో

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి... గెస్ట్ లిస్ట్ & గ్రాండ్ ఫుడ్ మెనూ

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి వీడియో వైరల్

టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి

ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..! వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లోబల్ టెక్నాలజీ

బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు

జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు

కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది

భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్

పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

Photos

+5

ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)