టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
Breaking News
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
Published on Thu, 02/26/2026 - 13:48
అమెరికాలోని దక్షిణాసియా కమ్యునిటీకి ఎఫ్‌ఎంసీజీ విభాగంలో సర్వీసులందిస్తున్న హెచ్‌ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ తమ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రాబ్ మోర్, విన్ మోర్’ దీపావళి ఆఫర్ విజేతను ప్రకటించింది. ఈ ఆఫర్‌ను గతేడాది దీపావళికి ప్రవేశపెట్టారు. తాజాగా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు ఉదయకుమార్ బాలతాండాయుధం విజేతగా నిలిచారు. ఇందులో భాగంగా లెక్సస్ ఆర్‌ఎక్స్ 350 కారు(సుమారు రూ.80 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. యూఎస్‌లోని బ్రిడ్జ్‌వాటర్ ప్రాంతంలో ఉన్న లెక్సస్ షోరూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘లక్ష్మి’ బ్రాండ్ ప్రతినిధుల సమక్షంలో ఉదయకుమార్ కుటుంబానికి కారు తాళాలను అందజేశారు.
ఈ సందర్భంగా హెచ్‌ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ సీఈఓ నీల్ సోనీ మాట్లాడుతూ.. ‘చాలా కుటుంబాల్లో తమ సంప్రదాయాలు, రుచుల పట్ల మాకున్న అంకితభావానికి ఈ బహుమతి నిదర్శనం. ప్రామాణిక ఆహారం, రుచి ద్వారా కుటుంబ సంస్కృతిని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ సీఓఓ అమ్రపాలి సోనీ మాట్లాడుతూ ‘గత 50 ఏళ్లుగా లక్ష్మి బ్రాండ్ ప్రవాస భారతీయుల ఇళ్లలో భాగమైంది. సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారికి స్వదేశీ రుచులను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని తెలిపారు.
కారు తాళాలు అందుకున్న అనంతరం విజేత ఉదయకుమార్ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘మేము గెలిచామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏళ్ల తరబడి మా ఇంట్లో లక్ష్మి ఉత్పత్తులు వాడుతున్నాం’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో దక్షిణాసియా కమ్యూనిటీకి నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను అందించడంలో ‘లక్ష్మి’ ప్రముఖంగా నిలుస్తోందని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం..
Tags : 1