కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది
Breaking News
సెమీకండక్టర్లకు దశాబ్దాలపాటు మద్దతు
Published on Thu, 02/26/2026 - 11:09
సంపన్న దేశాల తరహాలోనే వచ్చే 20–25 ఏళ్ల పాటు సెమీకండక్టర్ల వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) అదనపు కార్యదర్శి అమితేష్ సిన్హా తెలిపారు. చిప్‌ల తయారీ యూనిట్లలోని వెండార్లకు సింగిల్ విండో క్లియరెన్స్ సౌలభ్యం కోసం త్వరలో పోర్టల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.
‘పరిశ్రమకు కావాల్సిన మద్దతు గురించి ప్రభుత్వానికి అవగాహన ఉంది. ఇదేదో కొన్నేళ్ల వ్యవహారం కాదు.. కనీసం 20–25 ఏళ్ల పాటు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన సెమీకండక్టర్ వ్యవస్థలు ఉన్న దేశాల్లో రెండు నుంచి అయిదు దశాబ్దాల పాటు ప్రభుత్వాలు వాటికి మద్దతునిచ్చాయి. ఇది టీ20 కాదు. మారథాన్లాంటిది. మేము దీని కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని ఐఈఎస్ఏ విజన్ సదస్సు 2026లో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
వచ్చే నెలలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) 1.0 కింద మరికొన్ని సెమీకండక్టర్ ప్రాజెక్టులు ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఐఎస్ఎం 2.0ని ఆవిష్కరించనున్నట్లు సిన్హా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
Tags : 1