అనిల్‌ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు!

Published on Wed, 02/25/2026 - 19:24

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం ‘అబోడ్’ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ (Enforcement Directorate) బుధవారం (ఫిబ్రవరి 25) వెల్లడించింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.473.17 కోట్ల విలువైన ఆస్తులపై అమల్లో ఉన్న తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు కొనసాగింపుగా తాజా ఉత్తర్వు జారీ అయ్యింది.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భారత శిక్షాస్మృతి సెక్షన్లు 120-బి, 406, 420తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1989 నిబంధనల కింద రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (Reliance Communications (ఆర్‌కామ్)), అనిల్ అంబానీ, ఇతరులపై కేసులు నమోదు అయ్యాయి.

దర్యాప్తులో ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుండి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు, అందులో సుమారు రూ.40,185 కోట్లు బకాయి ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ముంబై పాలి హిల్‌లోని ఆస్తితో పాటు ఇతర ఆస్తులను అనిల్ అంబానీ కుటుంబ సభ్యుల ప్రైవేట్ ట్రస్ట్ అయిన రైజ్‌ ఈ ట్రస్ట్‌లో సమీకరించినట్లు గుర్తించింది. కుటుంబ సంపదను రక్షించుకునేందుకు, బ్యాంకుల రికవరీ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది.

ముంబైలోని ప్రముఖ పాలి హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 216 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ భవనం నగరంలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.15,700 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది.

Videos

అధైర్య పడొద్దు.. నేనున్నా.. టీడీపీ అరాచకాలపై ప్రజలకు జగన్ భరోసా

పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుపోయాయ..? హై కోర్టు అడ్వకేట్ సావిత్రి స్ట్రాంగ్ రియాక్షన్

జైల్లో ఉంచితే దారికొస్తారా? ఏపీ సీఎస్ పై హైకోర్టు ఫైర్

నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..

ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?

ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.. పవన్ పై తాటిపర్తి ఫైర్

బాబుకు దెబ్బ మీద దెబ్బ

రాజంపేట లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

Photos

+5

#Virosh : పెళ్ళి సందడి..ట్రెండింగ్ లో రష్మికా మండన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)