ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం

Published on Wed, 02/25/2026 - 16:30

న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్‌ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్‌ సీ) వేసే కేబుల్‌ నెట్‌వర్క్‌ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్‌ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్‌ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.

సబ్‌మెరీన్‌ కేబుల్‌ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్‌ సీ కేబుల్, డిజిటల్‌ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు డిజిటల్‌ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు.  ఈ నేపథ్యంలో క్లౌడ్‌ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు.  

రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. 
దేశీయంగా డిజిటల్‌ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్‌ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్‌ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థలకు డిమాండ్‌ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు.
 

Videos

అధైర్య పడొద్దు.. నేనున్నా.. టీడీపీ అరాచకాలపై ప్రజలకు జగన్ భరోసా

పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుపోయాయ..? హై కోర్టు అడ్వకేట్ సావిత్రి స్ట్రాంగ్ రియాక్షన్

జైల్లో ఉంచితే దారికొస్తారా? ఏపీ సీఎస్ పై హైకోర్టు ఫైర్

నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..

ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?

ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.. పవన్ పై తాటిపర్తి ఫైర్

బాబుకు దెబ్బ మీద దెబ్బ

రాజంపేట లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

Photos

+5

#Virosh : పెళ్ళి సందడి..ట్రెండింగ్ లో రష్మికా మండన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)