Good News: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. అధిక పెన్షన్ పునరుద్ధరణ
Breaking News
ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే చివరకు!: తమన్నా
Published on Wed, 02/25/2026 - 11:54
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటోంది హీరోయిన్ తమన్నా భాటియా. చేతిలో అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు వాటిని భద్రంగా కాపాడుకోవాలని చెప్తోంది. ఆ ముందుజాగ్రత్త లేకపోతే మొదటికే మోసం వస్తుందని, చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. రెండు దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే ఆభరణాల బిజినెస్‌లో అడుగుపెట్టింది.

నాన్న వల్లే..
ఆర్థిక భద్రత గురించి ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో నాన్నే నా ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఇప్పటికీ ఈ విషయంలో ఆయన సపోర్ట్, గైడెన్స్ ఎంతగానో ఉంది. ప్రస్తుతం నేను నా పెట్టుబడి వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ.. ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టాలన్న ముందుచూపుకు నాన్నే కారణం. ఆయన దగ్గరినుంచే ఈ ఆర్థిక క్రమశిక్షణ అలవడింది.
సంపాదన ఉన్నప్పుడే..
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకానొక సమయంలో యాక్టర్స్ భారీగా సంపాదించగలరు. కానీ, దాన్ని సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి. ఆ డబ్బును రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేయాలి. లేదంటే మాత్రం చివరకు ఏమీ మిగలదు అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ మూవీ మే 15న విడుదల కానుంది.
చదవండి: పవన్ కల్యాణ్‌పై పూనమ్ సెటైర్లు
Tags : 1