Breaking News

రాజమౌళిగారి సినిమాలో చేయడం నా కల: నయన్‌ సారిక

Published on Wed, 02/25/2026 - 00:40

‘‘నటనకు స్కోప్‌ ఉన్నపాత్రలే చేయాలనుకుంటున్నాను. ‘గం గం గణేశా, ఆయ్, క’ వంటి చిత్రాల్లో డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్స్‌ చేశాను. నయన్‌... నటించిందంటే ఆ సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యం. దర్శకుడు రాజమౌళిగారి సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా చేయాలన్నది నా డ్రీమ్‌’’ అని చెప్పారు హీరోయిన్‌ నయన్‌ సారిక. శ్రీ విష్ణు, నయన్‌ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యధునాథ్‌ మారుతీరావు దర్శకత్వంలో సుమంత్‌ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నయన్‌ సారిక మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం మహారాష్ట్ర. నాకు చిన్నప్పట్నుంచి నటి కావాలని ఉండేది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత యాక్టర్‌ అయ్యాను. ఒకవేళ నేను యాక్టర్‌ను కాకపోయి ఉంటే లాయర్‌ని అయ్యేదాన్ని.   ఇక ‘విష్ణు విన్యాసం’ సినిమా విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న మనీషా క్యారెక్టర్‌లో నటించాను.

ఇద్దరు లెక్చరర్స్‌ మధ్య జరిగే ప్రేమకథతో ఈ సినిమా మొదలవుతుంది. మనీషా తన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొన్న అమ్మాయి.. హాయిగా బతకాలని ఆశపడే అమ్మాయి. మరి... మనీషా సమస్యలు ఏంటి? ఆమె కోరుకున్నది ఆమెకు లభించిందా? లేదా అనేది మాత్రం థియేటర్స్‌లో చూడాల్సిందే. రెయిన్‌ సీక్వెన్స్‌లో నటించడం సవాలుగా అనిపించింది. ఈ చిత్రదర్శకుడు మంచి క్లారిటీ ఉన్న ఫిల్మ్‌మేకర్‌. సినిమాకు కావాల్సిన ప్రతిదీ నిర్మాత సమకూర్చారు. నేను నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్‌ 3న రిలీజ్‌ కానుంది. కన్నడ యాక్టర్‌ గణేష్‌తో ఓ సినిమా చేస్తున్నాను’’ అని తెలిపారు.

Videos

బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!

నందమూరి బాలయ్య కోసం నారా బావయ్య నిర్వాకం

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

నయా ట్రెండ్.. పెళ్లికి ముందు అంతా చేసేసి బ్లాక్ మెయిల్

భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!

సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి

కూటమి సర్కార్ కు షాకిచ్చిన సోము వీర్రాజు

యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు

Amalapuram: రెస్టారెంట్లో అమలాపురం కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ

Photos

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)