Breaking News

'కల్కి 2' సెట్స్‌లో అమితాబ్-కమల్.. 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా

Published on Tue, 02/24/2026 - 16:38

రెండేళ్ల క్రితం వచ్చిన 'కల్కి 2898 AD' ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు చేశారు. చివరలో ప్రభాస్‌ని కర్ణుడి పాత్రలో చూపించి సీక్వెల్‌పై అప్పుడే హైప్ పెంచారు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ మాట్లాడుకున్నారు. అయితే దీపిక.. ఈ మూవీ నుంచి తప్పుకోవడం లాంటివి జరగడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యంగా మొదలైంది. దానికి తోడు ప్రభాస్ కూడా పలు మూవీస్‌తో బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

కొన్నిరోజుల క్రితమే ఎట్టకేలకు 'కల్కి' సీక్వెల్ షూటింగ్ మొదలైంది. తొలి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రలో భయపెట్టిన కమల్ హాసన్ ఇందులో పూర్తిస్థాయి పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అమితాబ్.. ఎప్పటిలానే అశ్వద్ధామగా అలరించబోతున్నాడు. తాజాగా వీళ్లిద్దరూ సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ ఫొటోలని అమితాబ్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల తర్వాత కమల్‌తో మళ్లీ కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు.

'దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి ఇస్తోంది. చివరగా మేమిద్దరం 1985లో 'గిరఫ్తార్'లో కలిసి నటించాం' అని అమితాబ్ రాసుకొచ్చారు. వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి ప్రభాస్ ఎక్కడున్నాడు? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం 'ఫౌజీ', 'స్పిరిట్' షూటింగ్స్‌తో బిజీగా ఉన్న డార్లింగ్ హీరో.. మరి ఈ సెట్స్‌కి ఎప్పుడొస్తాడనేది తెలియాల్సి ఉంది.

ఇదే సినిమా తొలి భాగంలో సుమతిగా కీలక పాత్ర చేసిన దీపికా పదుకొణె.. సీక్వెల్ నుంచి తప్పుకొంది. చాన్నాళ్ల క్రితమే నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ అనుకుంటున్నారు. సాయిపల్లవిని తీసుకున్నారనే టాక్ వినిపించింది. కానీ నిర్మాణ సంస్థ ఈ విషయం ఎప్పుడు ప్రకటిస్తుందో ఏంటో?

(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

Videos

భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!

బయటపడ్డ బ్యూటీ బండారం.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లు గాన్..!

పులివెందుల చేరుకున్న జగన్

తేజస్ యుద్ధ విమానాలపై అనుమానాలు క్లారిటీ ఇచ్చిన HAL

వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో

జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్

Ram Role: ఇటు మహేశ్.. అటు రణబీర్ ఎవరు పర్ఫెక్ట్?

జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)

+5

అమెరికాలో విరుచుకుపడుతున్న మంచు తుపాను (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు)

+5

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం (ఫొటోలు)

+5

సోమాజిగూడలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)