Breaking News

కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్‌ ఉండేలా..

Published on Tue, 02/24/2026 - 15:46

వ్యాపార ప్రపంచంలో  అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన శక్తిమంతమైన మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్‌ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా.. దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్‌. ఇవాళ కోకిల్‌ బెన్‌ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె సంపన్న మహిళ వలే గ్రాండ్‌గా కాకుండా చాలా సాదాసీదాగా జరుపుకుంటూ..సింపుల్‌సిటీకీ కేరాఫ్‌గా నిలిచారామె. 

ఆఖరికి ధరించిన చీర సైతం సాధారణమైన నిమ్మపండు రంగు షిఫాన్‌ చీరలో కాలాతీత సౌందర్యానికి కట్టుబడి ఉన్నట్లుగా.. తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారామె. అంబానీ అప్‌డేట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేశాడరు. భారీ అలంకరణలు, ఖరీదైన ఆభరణాలుగానీ ధరించకుండా..ఆహ్లాదకరమైన పసుపు రంగు చీరతో నవ్వుతూ కనిపించారామె. ఒక సాధారణ గొలుసు, సున్నితమైన చెవుపోగులు, సాంప్రదాయ ఎరుపు బిండితో తన లుక్‌ని పూర్తిచేసింది. సహజ అలంకరణకు మించిన బ్యూటీ మరొకటి ఉండదని చెప్పకనే చెప్పారు కోకిలాబెన్‌. ఇక ఈ వేడుకలో ఆమె ఉనికిని తెలియజేసేలా చేతులు, కాళ్ల గుర్తుల ఫ్రేమ్‌తో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. 

కోకిలాబెన్‌ నేపథ్యం..
1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించిన కోకిలాబెన్ అంబానీ, అంబానీ కుటుంబానికి మాతృమూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య. 1955లో ధీరూభాయ్‌ను వివాహం చేసుకుని కొంతకాలం యెమెన్‌లోని ఆడెన్‌లో నివశించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందడంలో ఆమె కీలక సహాయక పాత్ర పోషించారామె. 

అలాగే 2002లో ఆయన మరణం తర్వాత, కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరిగిన హై ప్రొఫైల్ వివాదానికి ఆమె మధ్యవర్తిత్వం వహించారు. అలా 2005లో రిలయన్స్ గ్రూప్ విభజనకు దారితీసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌తో సహా పలు దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే గౌరవనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు కోకిలాబెన్‌.

 

(చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌)
 

Videos

భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!

బయటపడ్డ బ్యూటీ బండారం.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లు గాన్..!

పులివెందుల చేరుకున్న జగన్

తేజస్ యుద్ధ విమానాలపై అనుమానాలు క్లారిటీ ఇచ్చిన HAL

వరల్డ్ ఫేమస్ హలీమ్ తయారీ.. పిస్తా హౌజ్ లో

జగన్ చేతుల మీదుగా రేపే నందీశ్వరాలయం ఓపెనింగ్

Ram Role: ఇటు మహేశ్.. అటు రణబీర్ ఎవరు పర్ఫెక్ట్?

జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)

+5

అమెరికాలో విరుచుకుపడుతున్న మంచు తుపాను (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు)

+5

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం (ఫొటోలు)

+5

సోమాజిగూడలో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)