మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
2017లో బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడతడినే పెళ్లి చేసుకుంటున్నా
Published on Mon, 02/23/2026 - 14:27
మలయాళ నటి నిలీన్ సాండ్రా గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. దర్శకుడు శ్యామిన్ గిరీశ్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. దేవుడు ఒక స్త్రీని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తనను ప్రేమగా చూసుకునే ఓ వ్యక్తిని తన జీవితంలోకి పంపుతాడు.
పెళ్లి చేసుకోబోతున్నా..
అలా 2017లో నాకోసం నిన్ను పంపాడు. ప్రేమికుడిగా కాదు బెస్ట్ ఫ్రెండ్‌గా! ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడదే బెస్ట్ ఫ్రెండ్‌తో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోబోతున్నాను. దేవుడు నాకోసం పంపిన వ్యక్తిని పెళ్లాడబోతున్నాను అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో నిలీన్.. శ్యామిన్తో కలిసి సరదాగా గడిపిన క్షణాలున్నాయి.
ప్రియురాలి కోసం..
ఒకరికోసం ఒకరు నిలబడటం, విహారయాత్రకు వెళ్లడం, కలిసి భోజనం చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అలాగే శ్యామిన్.. నిలిన్కు చీర సర్దడం, కాలికి మెహందీ వేయడం, కాలికి మసాజ్ చేయడం, తనకోసం ఇల్లు తుడవడం ఇలా ఎన్నో చేశాడు. మలయాళ నటి నిలీన్ సాండ్రా.. 2018, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో నటించింది. అలా సామర్థ్య శాస్త్రం, రాక్ పేపర్ సిజర్స్ వెబ్ సిరీస్‌లలో కనిపించింది.
చదవండి: విజయ్- రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?
Tags : 1