మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
డైలీ సిప్‌తో పెట్టుబడులు మరింత సులభతరం
Published on Mon, 02/23/2026 - 08:55
మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారికి, చిన్న మొత్తాలతో పెట్టుబడుల ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి మైక్రో, డైలీ సిప్‌లు అనువైన సాధనాలుగా ఉంటున్నాయని షేర్.మార్కెట్ (ఫోన్‌పే వెల్త్) ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ హెడ్ నీలేష్ డి నాయక్ తెలిపారు. రోజువారీ ప్రాతిపదికన నగదు రూపంలో ఆదాయాలు ఉండేవారికి, స్వయం ఉపాధి పొందే వారికి ఇవి సరిగ్గా సరిపోతాయని చెప్పారు. క్రమంగా వారు పెట్టుబడుల పరిమాణాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లేందుకు తోడ్పడుతున్నాయని వివరించారు.
ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌లనేవి దీర్ఘకాలిక పెట్టుబడులనే విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలని నాయక్ సూచించారు. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి గురించి ఆందోళన చెందరాదన్నారు. తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కూడబెట్టుకునే అవకాశంగా దీన్ని పరిగణించాలని సూచించారు. స్వల్పకాలిక హెచ్చుతగ్గులపై స్పందించడం కంటే, సిప్‌లను కొనసాగించడం శ్రేయస్కరమన్నారు. వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ విభాగాల్లో స్టాక్స్, ఈటీఎఫ్‌లు, ఐపీవోలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అధునాతన ఫీచర్లు, ఇంటెలిజెంట్ టూల్స్ మొదలైనవి అందిస్తున్నామని నాయక్ చెప్పారు. మైక్రో సిప్ల ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టే యూజర్లకు యాప్‌లోని కంటెంట్‌తో పాటు సోషల్ మీడియా సహా పలు టచ్పాయింట్ల మాధ్యమాల ద్వారా అవగాహన కలి్పస్తున్నామని ఆయన తెలిపారు. మార్కెట్లపై నమ్మకాన్ని, పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇవి ఇన్వెస్టర్లకు తోడ్పడుతున్నాయన్నారు.
ఏఐ దన్ను
డిజిటల్ వినియోగం పెరిగే కొద్దీ వెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడులు, ట్రేడింగ్‌ని అన్ని వర్గాల ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చాయని నాయక్ చెప్పారు. పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో కృత్రిమ మేధ, డేటా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంలో తమకు, సజావుగా మార్కెట్ యాక్సెస్ లభించేలా ఇన్వెస్టర్లకు ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నామని నాయక్ తెలిపారు. ప్రత్యేకంగా సరళమైన, ఇంటరాక్టివ్ యాప్‌ని కూడా తాము రూపొందించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: రిటైర్మెంట్కు రెడీనా?
Tags : 1