ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
ఆ హీరో తల్లి కాళ్లు కడిగి నీళ్లు తాగుతాడు!
Published on Thu, 02/19/2026 - 12:23
బాలీవుడ్ నటుడు గోవిందా ఈ మధ్యకాలంలో సినిమా అప్‌డేట్స్ కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడి ఎఫైర్స్ గురించే ఎక్కువ ప్రచారం జరిగింది. భార్య సునీత అహూజాతో విడిపోతున్నాడని కూడా రూమర్స్ రాగా అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది.
ఆయన నుంచే ప్రేరణ
అయితే గోవిందా వ్యక్తిత్వం ఎంతో ఉత్తమమైనదని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానంటున్నాడు నటుడి మేనల్లుడు వినయ్ ఆనంద్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. గోవిందా అంకుల్‌ను చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. నేనే కాదు, ఆయన ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు దేశం మొత్తం ఆయన నుంచి స్ఫూర్తి పొందింది.
కాళ్లు కడిగి ఆ నీళ్లు
ఆయన్ను, ఆయన డ్యాన్స్‌ను కాపీ కొట్టని స్టార్ హీరోలు లేరు. డ్యాన్స్ రానివారు కూడా ఆయన్ను చూసి స్టెప్పులేయడం మొదలుపెట్టారు. అమ్మమ్మ (గోవిందా తల్లి) పుట్టినరోజు నాడు ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగేవాడు. అలాంటి గొప్ప వ్యక్తికి అవకాశాలు తగ్గిపోవడం చూసి చాలా బాధపడ్డాను. తనకోసం కొన్ని ఆఫర్లు తీసుకొచ్చినా చేసేవాడు కాదు. ఈవెంట్స్ చేయమని అడిగినా నిరాకరించేవాడు. తన కారణాలు తనకు ఉండొచ్చు. మా మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.
ఎన్నడూ ప్రశ్నించలేదు
ఆయన నాకు మామయ్య అయినప్పటికీ ఎందుకిలా తీసుకొచ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నారని ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆయన ఏం చెప్పినా ఓకే సర్ అంటుంటాను. దాదాపు 70 (హిందీ, భోజ్‌పురి) సినిమాల్లో హీరోగా నటించినా, పేరు, గుర్తింపు ఉన్నా ఆయన ముందు మాత్రం ఎప్పటికీ వినమ్రుడిగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: బేబి గర్ల్ మూవీ రివ్యూ
Tags : 1