Breaking News

బేబి గర్ల్ రివ్యూ: మూడురోజుల పసికందు ఎక్కడ?

Published on Thu, 02/19/2026 - 11:47

నిజ జీవితంలో ఎవరికైనా, ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం పరితపిస్తుంటారు. కాని సినిమాల్లో మాత్రం మనం చూసే సమస్యకు ముందే పరిష్కారం ఎంచుకోని ఉంటాడు దర్శకుడు. సినిమాలో ఆ పరిష్కార సన్నివేశం వచ్చేంతవరకు చూసే ప్రేక్షకులలో ఉత్కంఠ అలాగే ఉంటుంది. ప్రేక్షకుడు సినిమా కథలో చూపించే సమస్యపై ఎంత ప్రేరేపితమవుతాడో అంతగా ఆ సినిమా విజయవంతమవుతుంది. అదే దృక్పథంతో వచ్చిన తాజా సినిమా బేబిగర్ల్. ఇదో మళయాళ సినిమా. బాబి సంజయ్ అందించిన కథను అరుణ్ వర్మ తెరకెక్కించారు. వర్ధమాన మళయాళ నటులు నవీన్ పోలీ ప్రధాన పాత్రను పోషించి మెప్పించారు. ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న అంశం వాస్తవ ఘటనల ఆధారంగా ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాని ప్రేక్షకులు అమితంగా ఆరాధిస్తున్నారు. 

అంతగా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. ఈ సినిమా కథంతా ఓ మూడు రోజుల పసికందు చుట్టూనే నడుస్తుంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం ప్రాంతంలో ఓ ఆసుపత్రి నుండి మూడురోజుల పసికందు అనుకోకుండా మాయమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తో అణువణువు జల్లెడపట్టేలా ఎదిగిన టెక్నాలజీ ఈ మూడు రోజుల పసికందు ఎటు పోయిందో మాత్రం కనిపెట్టలేదు. పాప మాయమైన రోజున డ్యూటీలో ఉన్న అటెండెర్ సనల్ మాథ్యూ లేట్ గా రావడంపైనే అందరికీ అనుమానం కలుగుతుంది. దాంతో సనల్ తాను చేయని తప్పుకు చాలా బాధ పడతాడు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చేసే విచారణ నత్తనడకన సాగడంతో సనల్ తానే స్వయాన పాప కోసం వెతుకుతూ ఉంటాడు. 

సనల్ చేసిన వెతుకులాటలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వస్తాయి. అంతేకాదు సినిమా మొత్తంలో అటు పోలీసులకు గాని, ఇటు ఆసుపత్రి యాజమాన్యానికి కాని కనిపించని ఆ పసికందును సనల్ తిరిగి కనుక్కోని తన మీద వేసిన నిందను పోగొట్టుకుంటాడా లేదా అన్నది మాత్రం సోనీలివ్ లో స్ట్రీమ్ అవుతున్న బేబి గర్ల్ సినిమాలోనే చూడాల్సిందే. ఇది ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. వీకెండ్ వాచబుల్. ఇంకెందుకాలస్యం మీరు కూడా సోనీలివ్ కి ట్యూన్ చేసి ఆ బేబి గర్ల్ ని కనిపెట్టడానికి సనల్ కు సాయపడండి.
-హరికృష్ణ ఇంటూరు

Videos

ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్

దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు

వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..

Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్

జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!

వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?

ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!

Photos

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో రంజాన్‌ శోభ (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)

+5

‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్‌ కపుల్‌ జంటగా మరకతమణి 2 (ఫోటోలు)