ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా ప్రారంభం ఎప్పుడంటే..
Published on Thu, 02/19/2026 - 08:40
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ వీడియో పాన్ ఇండియా రేంజ్‌లో వైరల్ అయింది. మిలియనల్ల కొద్ది వ్యూస్ రాబట్టింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్టు నిర్మాణ సంస్థ స్పష్టతనిచ్చింది.
అల్లు అర్జున్ - అట్లీ (AA22) ప్రాజెక్ట్ కోసం ముంబైలో చాలా రోజులుగా మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే లోకేశ్ కనగరాజ్ మూవీ సెట్స్‌లోకి బన్నీ ఎంట్రీ ఇస్తాడు. ఇదే ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెడుతామని చిత్ర యూనిట్ తెలిపింది. వీరిద్దరి కలయికపై అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారనుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
Tags : 1