Breaking News

అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు నా కల్పితమే.. క్షమాపణలు కోరిన కావేరి

Published on Tue, 02/17/2026 - 13:04

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్‌ స్ట్రాటజర్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఆమె తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్‌ (Allu Arjun)తో యాడ్‌ షూటింగ్‌ అంటే చాలా ప్రోటోకాల్స్‌ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి..? ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.

కొన్ని రోజుల తర్వాత కావేరి క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్‌ విడుదల చేసింది. అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది.  42 నిబంధనలకు సంబంధించిన లిస్ట్‌ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోకూడదని విన్నవించుకుంది.  

బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి తెలిపింది. అల్లు అర్జున్‌పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్‌గా బన్నీ గురించి వైరల్‌ అయిన 42 నిబంధనలు అనేవి తాన కల్పితమేనని కావేరి బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్‌ అయ్యేందుకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఇంటర్వ్యూ పాడ్‌కాస్టర్  స్వీకృతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్  గురించి కావేరి మాట్లాడిన పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌తో పాటు ఇన్‌స్టా రీల్‌ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్‌పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది.

Videos

చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి

బావతో పెళ్లి ఇష్టంలేక ... కుంభమేళా మోనాలిసా ప్రేమకథ..

భారత్ కు వస్తున్న నౌకను పేల్చేసిన ఇరాన్..!

ఇరాన్ ఓపెన్ వార్నింగ్ 200 డాలర్లకు చమురు ధర! ఇక ఆర్థిక సంక్షోభమే

రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?

వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి

దేశంలో గ్యాస్ కొరత లేదు... కేంద్రం కీలక ఆదేశాలు

దుబాయ్ పై మరోసారి దాడి..

షా గౌస్ రెస్టారెంట్లో... గ్యాస్ కొరత ఏర్పడడంతో...

Photos

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్‌ రికవరీ (ఫొటోలు)