మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
Breaking News
మహాశివరాత్రి సెలబ్రేషన్స్.. దురంధర్ బ్యూటీ, శ్రీనిధి శెట్టి డ్యాన్స్ వైరల్
Published on Mon, 02/16/2026 - 17:04
మహాశివరాత్రి వేడుకల్లో పలువురు సినీతారలు సందడి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన వేడుకల్లో దురంధర్ బ్యూటీ సారా అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ కూడా పాల్గొన్నారు. వీరు పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన తమన్నా, శ్రీనిధి, సారా అర్జున్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. భక్తి పాటకు మంత్రముగ్ధులైన ముద్దుగుమ్మలు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంతా పంచ భూత క్రియ పూజలో పాల్గొన్నారు.
Maha Shivaratri night 🕉🔱@ishafoundation#Mahashivratri#MahaShivaratri2026#IshaMahashivratri2026#Adiyogi pic.twitter.com/p1lbdFwh0L
— Sara Arjun (@itz_Sara_Arjun) February 16, 2026
#WATCH | Actors Tamannaah Bhatia, Sara Arjun attended the Mahashivratri 2026 celebrations at the Isha Yoga Centre in Coimbatore, Tamil Nadu pic.twitter.com/Vw6QE75Drt
— ANI (@ANI) February 16, 2026
Tags : 1