Breaking News

పెద్ద సినిమాకు సెలక్ట్‌ అయ్యా.. తీరా హీరోగా పనికిరానని!

Published on Mon, 02/16/2026 - 15:28

ఎంతోమంది యాక్టర్స్‌ ఏదో ఒక సమయంలో తిరస్కరణకు గురవుతుంటారు. ఆల్‌రెడీ వేరేవాళ్లను సెలక్ట్‌ చేశాం, నీ ఫేస్‌కు ఈ పాత్ర సూటవదు... ఇలా ఏదో ఒక సాకు చెప్పి వారిని తప్పిస్తుంటారు. అలా ఓ నిర్మాత తనకూ ఓ సాకు చెప్పడంతో గుండు గీసుకున్నానంటున్నాడు బాలీవుడ్‌ హీరో సిద్దాంత్‌ చతుర్వేది.

పెద్ద సినిమాకు షార్ట్‌లిస్ట్‌
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. చాలామంది నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజెక​్‌ చేస్తూనే వచ్చారు. అయితే అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక పెద్ద సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లాను. నా పేరు షార్ట్‌లిస్ట్‌ చేయడంతో సంతోషపడ్డాను. కొన్ని వర్క్‌షాప్స్‌కి సైతం హాజరయ్యాను. నా పాత్ర కోసం నేను రెడీ అవుతూ ఉన్నాను. నేను ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ గెలిచిన ఏడాదికే ఈ సినిమా ఆఫర్‌ దక్కించుకున్నాను. 

రిజెక్షన్‌తో షాక్‌
దాంతో సినిమాల్లోకి రావడం పెద్ద కష్టమేం కాదని భావించాను. ఆ మూవీ దర్శకుడు, కాస్టింగ్‌ డైరెక్టర్‌కు నేను బాగా నచ్చాను. మూడు, నాలుగు నెలలు వర్క్‌షాప్‌కు హాజరయ్యాక నిర్మాత నన్ను స్క్రీన్‌ టెస్ట్‌ చేసి రిజెక్ట్‌ చేశాడు. నేను షాకయ్యాను. అసలేమైందని కాస్టింగ్‌ డైరెక్టర్‌ను అడిగాను. ఉంగరాల జుట్టు ఉంటే హీరో కాలేరు అని ఒక్క ముక్కలో సింపుల్‌గా చెప్పేశాడు. ఒకసారి జుట్టు స్ట్రయిట్‌ చేసుకుని ఆడిషన్‌కు రమ్మన్నారు. వాళ్లు చెప్పినట్లు చేశాక కూడా నన్ను రిజక్ట్‌ చేశారు.

గుండు గీసుకున్నా..
చాలా బాధపడ్డాను. నాకసలు జుట్టే వద్దని గుండు గీసుకున్నాను. మా అమ్మకు నా ఉంగరాల జుట్టు అంటే ఇష్టం. అయినా సరే కోపం, బాధతో దాన్ని తీసేశాను. ఇప్పుడీ రోజు సినిమా పోస్టర్‌లో అదే ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. సిద్దాంత్‌ చతుర్వేది..  గల్లీ బాయ్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన దో దీవానే షెహర్‌ మే ఫిబ్రవరి 20న విడుదలవుతోంది.

చదవండి: భార్యతో విడాకులు, జైలు జీవితం..నరకం అనుభవించానంటున్న సామ్రాట్‌ రెడ్డి

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )