Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
Published on Sun, 02/15/2026 - 09:31
ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్ రూమ్ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్లో రకరకాల మాడ్యులర్ కిచెన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్ వార్డ్ రోబ్స్ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్ లెస్ స్టీల్ మాడ్యులర్ కిచెన్స్’!
సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్‌లో వినియోగించిన స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్‌ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో స్టెయిన్లెస్ స్టీల్ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.
నిర్వహణ సులువు..
స్టెయిన్లెస్ స్టీల్ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్‌కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.
పర్యావరణ అనుకూలమైనవి..
సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్‌లెస్ స్టీల్‌తో తరుచూ కిచెన్ కౌంటర్ టాప్‌లు, క్యాబినెట్ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూషన్(ఐఎస్ఐ) మార్క్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి.
Tags : 1