Breaking News

'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?

Published on Sat, 02/14/2026 - 18:34

'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన లేటెస్ట్ సినిమా 'ఫంకీ'. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మూవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి థియేటర్లలో అనుకున్నంత స్పందన రాలేదు. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడ కామెడీ బాగున్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఇలాంటి రెస్పాన్స్‌తో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి?

ఫంకీ చిత్రానికి తొలిరోజు నెట్ వసూళ్లు రూ.2.25 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే ఓవర్సీస్‌లో మొదటిరోజు పూర్తయ్యేసరికి లక్షా 85 వేల డాలర్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మనవరకు మాత్రం ఇంకా పోస్టర్ లాంటిది రిలీజ్ చేయలేదు. వస్తున్న టాక్ బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యాక ఏమైనా పోస్టర్ వదిలితే వదలొచ్చు. లేదంటే లేకపోవచ్చు.

(ఇదీ చదవండి: 'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం: నిర్మాత నాగవంశీ)

'ఫంకీ'తో పాటు రిలీజైన మరో తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి ఈ రెండింటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారనేది సోమవారానికి తేలుతుంది.

'ఫంకీ' విషయానికొస్తే.. కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. ఓ నిర్మాణ సంస్థలో సినిమా కోసం అవకాశం దక్కించుకుంటాడు. రూ.4 కోట్లతో పూర్తి చేస్తానని రూ.40 కోట్ల బడ్జెట్ చేస్తాడు. అయినా సరే మూవీని పూర్తి చేయడు. దీంతో నిర్మాత కూతురు చిత్ర(కాయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. రూ.కోటితో మిగిలిన చిత్రమంతా పూర్తిచేయాలనే షరతు పెడుతుంది. మరి అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తయిందా? ఈ క్రమంలో కోమల్-చిత్ర మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )