‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 02/13/2026 - 13:36

టైటిల్‌: ఫంకీ
నటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
ఎడిటింగ్‌: నవీన్ నూలి 
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం 
విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

విశ్వక్‌ సేన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజైన ‘లైలా’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘ఫంకీ’పై ఓ మోస్తరు అంచనాలు అయితే ఏర్పాడ్డాయి. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇలా ఈ వారం(ఫిబ్రవరి 13) భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్‌ సేన్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
కోమల్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌(నరేశ్‌) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్‌ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్‌) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్‌ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్‌లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్‌ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్‌ రాజ్‌) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్‌ సినిమాలంటే తెలుగు ఆడియన్స్‌కి ఓ అంచనా ఉంది. కథ గొప్పగా ఉండదు కానీ పంచ్‌ డైలాగ్స్‌తో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కథనాన్ని నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. అయితే గొప్ప కథ లేకపోయినా సరే..చెప్పుకోవడానికైనా కొంత స్టోరీ అయినా ఉండాలి కదా. అలా కాకుండా కేవలం సింగిల్‌ లైనర్స్‌తో పంచ్‌ డైలాగులు పేలిస్తే.. సినిమా ఆడేస్తుందని భావిస్తే అది పొరపాటే. జాతి రత్నాలు కేవలం పంచ్‌ డైలాగ్స్‌ వల్లే ఆడలేదు. అందులో కొంత కథ ఉంటుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటికి తోడుగా పంచ్‌ డైలాగ్స్‌ కూడా ఉండడంతో ఆ సినిమా హిట్‌ అయింది. కానీ ‘ఫంకీ’లో పంచ్‌ డైలాగ్స్‌ తప్ప మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. ఆ డైలాగ్స్‌ కూడా కామన్‌ ఆడియన్స్‌కి పెద్దగా నవ్వు తెప్పించవు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం నవ్వుకుంటారు. 

డైలాగ్స్‌ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్‌ పాయింట్‌ చుట్టూనే తిరుగుతూ.. చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్‌ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథని విశ్వక్‌, నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్నంతసేపు మన మనసుని వెంటాడుతూనే ఉంటుంది.

ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం ఆసక్తికరంగా సాగదు. ఒక్కో సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉండడు. అన్ని విషయాలను లైట్‌ తీసుకునే వ్యక్తిలో కూడా ఎమోషన్లు ఉంటాయని హీరో పాత్ర ద్వారా చెప్పాలకున్నారు. కానీ దాన్ని తెరపై సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. క్లైమాక్స్‌లో మదర్‌ సెంటిమెంట్‌ని కూడా యాడ్‌ చేశారు కానీ అది వర్కౌట్‌ అవ్వలేదు.  సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ సన్నివేశాల్లో మొదట్లో కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి సీన్లే మళ్లీ మళ్లీ రిపీట్‌ అవ్వడంతో నవ్వు రాకపోగా.. ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. కోమల్‌, చిత్ర పాత్రల పరిచయ సన్నివేశాలు బాగుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కథనం కాస్త వేగంగా  సాగుతుంది.  అనుదీప్‌, కల్యాణ్‌ శంకర్ల గెస్ట్‌ అప్పీయరెన్స్ కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. ఉన్నంతలో మదర్‌ సెంటిమెంట్‌ కాస్త ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. 



ఎవరెలా చేశారంటే..
విశ్వక్‌ సేన్‌ మంచి నటుడే. అయితే అనుదీప్‌ రాసిన ‘కోమల్‌’క్యారెక్టర్‌ అతనికి సరిగా సూట్‌ అవ్వలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఎప్పటిమాదిరే పాత్రలో లీనమైన నటించాడు.  కానీ పూర్తిగా నవ్వించలేకపోయాడు.  కయాదు లోహర్‌ తెరపై అందంగా కనిపించింది. నరేశ్‌ పాత్ర నిడివి తక్కువే. ఆయనను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సంపత్‌ రాజ్‌ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్‌ చూపించదు. ఈశ్వరీరావు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. 

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ మాత్రం దారుణంగా ఉంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Videos

మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్

మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు

జోరుమీదున్న వెంకీ మామ ఏకంగా లైన్ లో 7 సినిమాలు

Arjun Sarja: రోజుకో గంట మీ శ‌రీరానికి ఇచ్చుకోండి లైఫ్‌లో ఫిట్‌గా ఉంటారు

కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి.. కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

మున్సిపల్ రిజల్ట్పై BRS క్రిశాంక్ కామెంట్స్

ఇండియన్ ఆర్మీ లోకి వేట పక్షులు

దోచుకోవడమే వీళ్లకి తెలుసు స్టాలిన్ పై విజయ్ ఫైర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్.. కార్యకర్తల సంబరాలు

రేణిగుంట నారాయణ కాలేజీలో దాష్టీకం విద్యార్థిని చితకబాదిన లెక్చరర్

Photos

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )

+5

విశ్వక్‌ సేన్‌ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కశ్మీర్‌ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష‍్మీరాయ్ (ఫోటోలు)

+5

శ్రీశైలం: నల్లమల అడవుల్లో భక్తుల పాదయాత్ర (ఫోటోలు)

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)