‘నిలవే’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 02/13/2026 - 08:00

టైటిల్‌: నిలవే
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు
నిర్మాణ సంస్థ: POV ఆర్ట్స్  ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి  కే వెన్నం
దర్శకత్వం -  సౌమిత్  పోలాడి, సాయి  కే వెన్నం
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

ట్రైలర్‌ రిలీజ్‌ వరకు నిలవే చిత్రం గురించి ఎవరికీ తెలియదు. కానీ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ మూవీపై బజ్‌ క్రియేట్‌ అయింది. చాలా మంది అర్జున్‌ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఈ చిత్రం అ అంచనాలను అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
అర్జున్‌(సౌమిత్ రావు) అనాథ. స్నేహితుడు(వైవా హర్ష) ఇంట్లో ఉంటూ ఓ యాడ్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. అతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. కానీ ఆయన జీవితంలోకి అమ్మాయి రాదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఫ్లాట్‌లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమే అతిథి(శ్రేయాసి సేన్). తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. పరిచయం పెంచుకొని దగ్గరకు అవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా దగ్గరవుతుంది. కానీ ప్రేమను అంగీకరించలేకపోతుంది. దానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్‌ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్‌ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్‌, అతిథిలు  ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. ఓ మంచి ప్రేమ కథని సంగీతానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం. ఒంటరి జీవితం వద్దనుకునే అబ్బాయి.. అందర్నీ వదిలేసి ఒంటరిగా బతకాలనుకున్న అమ్మాయి.. వీరిద్దరి ప్రేమ కథే ఈ సినిమా. హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే అర్జున్‌ పాత్రను చూస్తే అర్థమవుతుంది. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్‌ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి కథనం రొమాంటిక్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి.

అర్జున్‌ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి వెనకడుగు వేయడంతో.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం అర్థమైపోతుంది. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. అతిథి ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు  కానీ,  థియేటర్స్‌కి వెళ్లి చూసిన వారికి మాత్రం గొప్ప అనుభూతిని అందిస్తుసింది.

ఎవరెలా చేశారంటే...
ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులంతా కొత్తవారే.అయినప్పటికీ చక్కగా నటించారు. అర్జున్‌ పాత్రకు సౌమిత్‌ రావు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఎమోషనల్‌ సన్నివేశాలలో చాలా బాగా నటించాడు. తెరపై బాలీవుడ్‌ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా శ్రేయాసి సేన్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా బాగుంది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Videos

మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్

మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు

జోరుమీదున్న వెంకీ మామ ఏకంగా లైన్ లో 7 సినిమాలు

Arjun Sarja: రోజుకో గంట మీ శ‌రీరానికి ఇచ్చుకోండి లైఫ్‌లో ఫిట్‌గా ఉంటారు

కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి.. కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

మున్సిపల్ రిజల్ట్పై BRS క్రిశాంక్ కామెంట్స్

ఇండియన్ ఆర్మీ లోకి వేట పక్షులు

దోచుకోవడమే వీళ్లకి తెలుసు స్టాలిన్ పై విజయ్ ఫైర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్.. కార్యకర్తల సంబరాలు

రేణిగుంట నారాయణ కాలేజీలో దాష్టీకం విద్యార్థిని చితకబాదిన లెక్చరర్

Photos

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )

+5

విశ్వక్‌ సేన్‌ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కశ్మీర్‌ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష‍్మీరాయ్ (ఫోటోలు)

+5

శ్రీశైలం: నల్లమల అడవుల్లో భక్తుల పాదయాత్ర (ఫోటోలు)

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)