Breaking News

ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!

Published on Thu, 02/12/2026 - 14:43

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఎంజీ మెజెస్టర్ (MG Majestor) వచ్చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీ.. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త మెజెస్టర్ కోసం ఎంజీ మోటార్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని రూ.41 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 2026 మే నెలలో డెలివరీలు జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఏప్రిల్‌లో టెస్ట్ డ్రైవ్‌లు మొదలవుతాయి. కాగా కంపెనీ త్వరలోనే ఈ కారు ధరలను వెల్లడించనుంది.

ఎంజీ మోటార్.. తన కొత్త మెజెస్టర్ ఎస్‌యూవీని మూడు వేరియంట్లలో లాంచ్ చేయనుంది. అవి ఎంట్రీ లెవల్ షార్ప్ 4x2, మిడ్ స్పెక్ సావీ 4x2 & టాప్ స్పెక్ సావీ 4x4. ఇవి 6 సీటర్, 7 సీటర్ రూపంలో మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంది. మెజెస్టర్‌ను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న మొదటి 3,000 మంది కస్టమర్లకు 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్ట్, 5 సంవత్సరాల లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్‌ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఎంజీ మెజెస్టర్ కేవలం 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఇది 215 హార్స్ పవర్ & 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ రెగ్యులర్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. పనితీరు దాదాపు గ్లోస్టర్ మాదిరిగా ఉంటుందని సమాచారం.

ఇదీ చదవండి: కారు మైలేజ్‌ కోసం.. ముఖ్యం ఈ వేగం!

మంచి డిజైన్ కలిగిన మెజెస్టర్.. ట్విన్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 12 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ & 64 కలర్ యాంబియంట్ లైట్స్ వంటి వాటితో పాటు.. లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ కూడా పొందుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ & హిల్-డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజ్‌లు, సరౌండ్ వ్యూ కెమెరాలు & ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

Videos

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి

Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం

21 ఏళ్ల బంధం.. ఎప్పటికీ మధురమే.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..!

బన్నీ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్ స్రవంతి

Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)