మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్
Breaking News
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Published on Thu, 02/12/2026 - 08:57
తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న కేవలం తమిళ్‌లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్‌లో ఈ ఏడాది పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జీవాకు జోడీగా ప్రార్థన నటించింది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నితీష్.. తమిళంలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) కావడం విశేషం.

జీవా హిట్ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) నెట్‌ఫ్లిక్స్(Netflix)లో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండానే విడుదల చేయడంతో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. థియేటర్‌లో కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‌కు తీసుకురావడం విశేషం. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
Tags : 1