‘వారణాసి’ కోసం రాజమౌళి, మహేశ్‌ కొత్త స్ట్రాటజీ!

Published on Sun, 02/08/2026 - 16:37

ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రం ‘వారణాసి’. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌ ఒక్కటే నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్స్‌ షురూనే చేయలేదు కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాయి. అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు గాను జక్కన్న, మహేశ్‌ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట. సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి తీసుకోవద్దని ఫిక్స్‌ అయ్యారట.

గత సినిమాలకు కూడా రాజమౌళి పూర్తిగా పారితోషికం తీసుకునేవాడు కాదు. కొంతమేర రెమ్యునరేషన్‌గా తీసుకొని.. మిగతాది లాభాల్లో వాటాగా తీసుకునేవాడు. కానీ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండానే పని చేస్తున్నాడట. పారితోషికంగా ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్‌ బాబు కూడా ఒక్క పైసా తీసుకోకుండా, నిర్మాణంలో భాగస్వామి అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఉన్న బజ్‌ దృష్ట్యా..కచ్చితంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. 

ఇక హిట్‌ టాక్‌ వస్తే మాత్రం.. ఊహించని కలెక్షన్స్‌ రావడం ఖాయం. ఈ  లెక్కన అటు జక్కన్నకు, ఇటు మహేశ్‌కు రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్‌ కంటే ఎక్కువే అందే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఓవర్సీస్‌లో రైట్స్‌ తీసుకోవడం ద్వారా జక్కన్నకు రూ. 150 కోట్లకు పైనే లాభం వచ్చే చాన్స్‌ ఉంది. అలాగే నిర్మాణం భాగస్వామ్యం అయిన మహేశ్‌కు రూ. 150-200 కోట్ల వరకు రావొచ్చు. 

మహేశ్‌బాబు ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్

Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు

చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?

సౌందర్య, మోహన్ బాబు వివాదంపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

జాతిపిత ఎవరు? కేసీఆర్, జయశంకర్, శ్రీకాంతాచారి

గతంలో బూతు బొమ్మలు & బూతు పుస్తకాల కోసం చాలా కష్ట పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు..!

వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

డొల్ల కంపెనీలతో బిగ్ స్కామ్.. OTP లేకుండానే 5 వేల కోట్లు..

లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..

Photos

+5

గ్లామర్‌తో పడేస్తున్న శ్రద్ధా దాస్‌.. నెట్టింట ఫోటోలు వైరల్‌

+5

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక శోభ (ఫొటోలు)

+5

కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్‌ జగన్‌ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల, థమన్‌, తేజ సజ్జా (ఫోటోలు)

+5

వివాహ వేడుకలో వైఎస్‌ జగన్‌.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ బర్త్ వేడుకల్లో మన్మధుడు హీరోయిన్ అన్షు.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

+5

టి20 వరల్డ్‌ కప్‌ ప్రారంభ వేడుక అదుర్స్‌ (ఫొటోలు)

+5

సాక్షి మీడియా గ్రూప్‌, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)