చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్

Published on Sat, 02/07/2026 - 08:00

యాక్షన్ కింగ్, నటుడు, దర్శకుడు అర్జున్ సర్జాకు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు వారికి పరిచయం అయిన అర్జున్‌.. తన కెరీర్‌లో సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, తన 46 ఏళ్ల సినీ జీవితంలో చాలామంది తనను మోసం చేశారని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని అర్జున్‌ ఇలా చెప్పారు. 'నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలామంది మోసం చేశారు. ఇప్పుడు వారి పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండే వాళ్లే.. నాకు ఏమీ తెలియని వయసులో  మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తోంది.. కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అప్పుడు తెలియలేదు. నా వాళ్లే నన్ను మిస్‌- యూజ్‌ చేశారు. 

ఆరోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి.  పెట్టుబడుల ఎక్కడ పెట్టాలో  శోభన్ బాబు గారు చాలాసార్లు నాకు చెప్పారు.  నాతో ఆయన చాలా క్లోజ్‌గా ఉండేవారు. పెట్టుబడులు పెట్టాలని డబ్బు ఎక్కడ వృథాగా పోతుందో చూసుకోమని నాతో చెప్పేవారు. కానీ, ఆ సమయంలో నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో  ఒక సినిమాలో కలిసి పనిచేశాను. కేవలం ఒక్క మూవీతోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మా అనుబంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట వినిఉంటే బాగుండేది' అని ఇప్పుడు అనిపిస్తుందని అర్జున్‌ గుర్తు చేసుకున్నారు.

తెలుగులో కూతురు ఎంట్రీ
కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని మధుగిరిలో జన్మించిన అర్జున్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనదైన యాక్షన్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు పొందారు. అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ  ‘సీతా పయనం’ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న  థియేటర్లలోకి వస్తోంది. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ‘సేవగన్‌’తో 1992లోనే డైరెక్టర్‌గా మారిన ఆర్జున్‌.. తెలుగులో ‘సీతాపయనం’తో  తొలిసారి దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లోనే తన కూతురు రాణించాలని ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. 

Videos

తూచ్.. మనసు మార్చుకున్నా..

అగ్ని ప్రమాదం.. బస్సులో 39 మంది ప్రయాణికులు

12 ఏళ్ల బాలికపై గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్

మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

వాళ్లూ.. ఉపాధ్యాయులే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

2026లో ప్రపంచం అంతమేనా.. బాబా వంగా అంచనాల వెనుక!!

బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI

నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబుకు వణుకు పుట్టేలా 300 కార్లతో అంబటి ఇంటికి కాపు నేతలు

భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు

Photos

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

బంజారాహిల్స్‌ : సజ్జనర్‌ సార్‌.. నేనూ పోలీసింగ్‌ చేస్తా.. (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)