Breaking News

జోడీ రిపీట్‌

Published on Sat, 02/07/2026 - 00:03

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్, హీరోయిన్‌ రష్మికా మందన్నా జోడీ రిపీట్‌ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్‌టెయిల్‌ 2’లో షాహిద్‌ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్‌ మరో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్‌ కామెడీ మూవీలో షాహిద్‌ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.

హిందీలో ‘బదాయి హో, మైదాన్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్‌ శర్మ ఓ రొమాంటిక్‌ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్‌ కపూర్‌కు వినిపించగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట షాహిద్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్‌ స్క్రీన్‌పై రిపీట్‌ అవుతుంది. జియో స్టూడియోస్‌తో కలిసి సునీల్‌ ఖేతర్‌ పాల్‌ ఈ సినిమాను నిర్మించనున్నారట.

మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు.  
 

Videos

ఇరాన్‌లో నీరు మాయం? దేశమే రోడ్డెక్కింది!

మనిషి చనిపోయినా కూడా వదలట్లే.. వీళ్ళు పోలీసులా.. రాక్షసులా..

పాకిస్తాన్‌కు అమెరికా బిగ్ షాక్ POK భారత్‌లో అంతర్భాగమే..

ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యే నువ్వు అహంకారం తగ్గించుకో.. లేదంటే..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ

అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త

మల్లా రెడ్డిపై దాడి... 150 మంది వచ్చి దబా దబా కొట్టారు

గజ్వాల్‌లో హై టెన్షన్.. హరీశ్‌రావుకు నిరసన సెగ

సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)