Breaking News

చెక్‌బౌన్స్‌ కేసులో తీహార్‌ జైలుకు కిక్‌-2 నటుడు

Published on Fri, 02/06/2026 - 11:11

కిక్‌-2 సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్‌బౌన్స్‌ కేసులో నటుడికి  ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. కానీ, గడుపు పెంచాలని  పలుమార్లు కోరుతూ కొంత కాలంగా ఆయన కాలయాపన చేస్తూ వచ్చారు.  దీంతో కోర్టు ఆగ్రహం చేయడంతో తప్పనిపరిస్థితిల్లో తీహార్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్‌  లిమిటెడ్‌ సంస్థ 2017లో చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టింది.   రాజ్‌పాల్ యాదవ్‌ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్  రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్‌ చెక​్‌లు కూడా బౌన్స్‌ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్‌పాల్ దంపతులను 2018లోనే  దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి  ఫిర్యాదుదారుడికి  తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్‌ అయింది. తీహార్‌ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది.

Videos

జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్

దమ్మున్నోడి దెబ్బ.. ఒక్కడిని ఎదుర్కోవడానికి 9 మంది ప్రెస్ మీట్

బాబోయ్ పెద్ద పులి..!

పారిశుధ్య కార్మికురాలి కాళ్లు మొక్కిన తమిళ నటుడు

జగన్ కోసం ఎదురుచూస్తున్న వల్లభనేని వంశీ

జన సునామిని చూసి కూటమికి ప్యాంటు తడిసిపోతుంది

బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్

జగనన్న పాటకు డ్యాన్స్ లు వేసిన జనం

పిల్లాడిని ముద్దాడిన జగన్..

గోల్డ్, సిల్వర్ రేట్స్ సీన్ రివర్స్.. ఒక్కసారే రూ. 20000 ఢమాల్

Photos

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

బంజారాహిల్స్‌ : సజ్జనర్‌ సార్‌.. నేనూ పోలీసింగ్‌ చేస్తా.. (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)