Breaking News

ఐటీ జీతాల కంటే అర్బన్‌ కంపెనీలో అధిక‍ సంపాదన!

Published on Fri, 02/06/2026 - 09:18

ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్‌ఫామ్‌పై గిగ్‌వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్‌ కంపెనీ తెలిపింది. అర్బన్‌ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.

బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్‌డోర్‌ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.

తమ ప్లాట్‌ఫామ్‌లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్‌ కంపెనీ తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై టాప్‌–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్‌–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్‌–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.

ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది.

Videos

జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్

దమ్మున్నోడి దెబ్బ.. ఒక్కడిని ఎదుర్కోవడానికి 9 మంది ప్రెస్ మీట్

బాబోయ్ పెద్ద పులి..!

పారిశుధ్య కార్మికురాలి కాళ్లు మొక్కిన తమిళ నటుడు

జగన్ కోసం ఎదురుచూస్తున్న వల్లభనేని వంశీ

జన సునామిని చూసి కూటమికి ప్యాంటు తడిసిపోతుంది

బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్

జగనన్న పాటకు డ్యాన్స్ లు వేసిన జనం

పిల్లాడిని ముద్దాడిన జగన్..

గోల్డ్, సిల్వర్ రేట్స్ సీన్ రివర్స్.. ఒక్కసారే రూ. 20000 ఢమాల్

Photos

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

బంజారాహిల్స్‌ : సజ్జనర్‌ సార్‌.. నేనూ పోలీసింగ్‌ చేస్తా.. (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)