చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
Published on Thu, 02/05/2026 - 14:06
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్‌లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్‌లో రిపోర్టు నార్మల్‌గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్‌లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్‌కి సంబంధించిన టెస్ట్‌లు చేసినా..ఫలితం శూన్యం.
దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్‌ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు.
ఎందువల్ల అంటే..
ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు.
నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన.
బీ12 లోపం అంటే..
నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు.
దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్‌లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్‌లు.
When the Brain Was Blamed; but the Nerves Told the Truth
She was 70, soft-spoken, and deeply worried.
For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026
(చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)
Tags : 1