చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..
Published on Thu, 02/05/2026 - 13:21
స్ట్రాబెర్రీలు ఈ సీజన్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి.
వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.
స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.
వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.
అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఇందులోని ఎల్లాజిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది
స్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
(చదవండి: ప్లీజ్ కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండండి..!)
Tags : 1