Breaking News

'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్‌ శిక్షణ..

Published on Thu, 02/05/2026 - 11:43

బరువు తగ్గించే జైలు గురించి విన్నారా..?. ఔను మీరు వింటుంది నిజమే..!. నిర్బంధంలో ఉంచి స్లిమ్‌గా మార్చే జైలు ఇది. ఇక్కడకు వస్తే..సులభంగా వెయిట్‌లాస్‌ అవ్వొచ్చట. అంతేకాదండోయ్‌ అందుకోసం ఎంత చెల్లించాలో తెలిస్తే విస్తుపోతారు. ఖైదీల్లా బరువు తగ్గడం కోసం జైలు ఏంటి అనుకోకండి..అక్కడ ఉండే కఠినమైన ఆహార నియమాలు, వర్కౌట్లు తప్పించుకోకుండా ఉండేందుకు అచ్చం జైలు మాదిరి వాతావరణంతో ఉంటుంది ఆ ప్రదేశం. మరి అదెక్కడ ఉంది..?. ఎలా సన్నగా అయ్యేలా చేస్తారు అంటే..

బరువు తగ్గించే జైలు చైనాలో ఉంది. దీని గురించి ఒక ఆస్ట్రేలియాన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంట్‌ చేసి మరి వీడియో షేర్‌ చేశారు. తాను అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరి ఇక్కడకు వెళ్లినట్లు వెల్లడించాడు కూడా. దీన్ని ఫ్యాట్‌ ప్రిజన్‌ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో రకాలుగా డైట్‌లు, వర్కౌట్లు చేసినా..పెద్దగా ప్రయోజనం పొందలేని వాళ్లంతా వస్తారట. 

శిక్షణ ఎలా ఉంటుందంటే..
అక్కడ వాళ్లకు రోజు ఉదయం 7.30 గంటలకు అలారం మోగడంతో ప్రారంభమవుతుందట. ఉదయం 8 కల్లా అదనపు బరువుని చెక్‌ చేయడం కోసం క్యూలైన్‌ ఉంటుంది. తర్వాత 9.20 నుంచి 10.30 వరకు ఏరోబిక్‌ క్లాస్‌ ఉంటుంది. దీని తర్వాత ఉదయం 11.15 గంటలకు రోజులో తొలి భోజనం మొదలవుతుంది. అందులో అల్పాహారంగా నాలుగు గుడ్లు, ఒక బ్రెడ్‌ స్లైస్‌, టమాట, కొన్ని దోసకాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. ఈ సెషన్‌ తర్వాత కార్డియో వ్యాయామాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. 

ఆ తర్వాత మధ్యాహ్నం 2.50 నుంచి 4 గంటల మధ్య వెయిట్‌ లిఫ్టింగ్‌ సెషన్‌ మొదలవుతుంది. ఇక లంచ్‌కి బ్రేజ్డ్ డక్, తామర కాడలు, వేయించిన కూరగాయలు, కొన్ని క్యారెట్లు, అరటిపండ్లు ఉంటాయి. దీని తర్వతా రెండు గంటల పాలు హై ఇంటెన్సివ్‌ శిక్షణ, స్పిన్‌ క్లాస్‌లు ఉంటాయి. ఇక రాత్రి భోజనంలో పుచ్చకాయ, కూరగాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. దీని తర్వాత మరోసారి బరువు చెక్‌చేసే ‍ప్రక్రియ అనంతరం నిద్రకు ఉపక్రమిస్తారు. అంటే ఈ జైలులో రోజుకి సుమారు 12 గంటల వ్యాయామాలు ఉంటాయని చెబుతున్నాడు ఇన్‌ఫ్టుయెన్సర్‌. 

 

 

ఈ జైలులో ఉండి ఒక మహిళ నాలుగు వారాల వ్యవధిలోనే ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు. అంటే ఆమె 85.6 కిలోల బరువు ఉండగా..ఇక్కడకు వచ్చాక 79.6 కిలోలకు వచ్చింది. అంతేగాదు మన వ్లాగర్‌ సైతం అంతకుమునుపుకి ఇక్కడకు వచ్చాక చాలా పరివర్తన వచ్చాడు. అంతలా బరువు తగ్గ్గిన అతడి పరివర్తనను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు కూడా. 

ఇదిలా ఉండగా, చైనాలో లాట్‌జైళ్లు ఇంటెన్సివ్‌, రెసిడెన్షియల్‌, మిలటరీ తరహా బరువు తగ్గించే బ్యూట్‌ క్యాంపులు చాలానే ఉన్నాయట. ఎందుకంటే అక్కడ రోజురోజుకి పెరుగుతున్న ఊబకాయ సంక్షోభం నేపథ్యంలో ఇలాంటివి అత్యంత ప్రజాదరణ పొందుతుండటం విశేషం. 

 

జైళ్లుగా ఎందుకు పిలుస్తారంటే..
నేరస్తుల నిర్బంధ కేంద్రాలు కాకపోయినా..అక్కడ ఉండే సౌకర్యాలు జైళ్లను తలిపించేలా ఉంటాయి. పైగా చుట్టూ ఉండే వాతావరణం సైతం జైలు మాదిరిగా ఉంటుంది. అంటే ఎత్తైన కాంక్రీట్‌ గోడలు, ముళ్ల కంచెలతో లాక్‌ చేసిన గేట్లు వంటి గట్టి పకడ్బంది ఉంటుంది. దీంతోపాటు ఎక్కడకక్కడ గట్టి నిషా ఉంటుంది. ఇక్కడకు వచ్చే వాళ్లంతా సాంప్రదాయ ఆహారాలు తీసుకున్నా.. బరువు తగ్గని వాళ్లు కాబట్టి నిర్వాహకులు అంతలా వాళ్లని పర్యవేక్షిస్తారు. 

ఇక్కడ వాళ్లకు 14 నుంచి 28 రోజుల శిక్షణకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా 28 రోజులకు వసతి, ఆహారం, శిక్షణతో సహా రూ. 90 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు ఉమ్మడి వసతినే ఎంచుకుంటారు. ఒక్కో గదికి సుమారు ఐదుగురు వరకు ఉంటారట.  ఇదంతా చూస్తుంటా..ఊబకాయంతో మనుషులు ఇంతలా ఇబ్బందులు పుడుతున్నారా..? అనిపిస్తోంది కదూ..!.

(చదవండి: 

 

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)