రష్మిక, విజయ్ పెళ్లి డేట్ వచ్చేసింది..!
Breaking News
ఒక్కటి కాదు.. వస్తున్నాయ్ 100 రిలయన్స్లు
Published on Thu, 02/05/2026 - 06:14
ముంబై: దేశాభివృద్ధికి శాంతి భద్రతలు, స్థిరమైన నాయకత్వం కీలకమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. భారత్ నిలకడగా రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. జియోబ్లాక్రాక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పటిష్టమైన ఆర్థిక ప్రగతికి 15–20 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, సామాజిక సామరస్యత అవసరమని తెలిపారు. సమాచారం, వినియోగం, వాణిజ్యంలాంటి అంశాల్లో పరివర్తనకు భారత్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 కంపెనీలు కొత్తగా రిలయన్స్ స్థాయికి ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంబానీ చెప్పారు.
ఏఐ గురించి ఆందోళన వద్దు: ఏఐ గురించి భయపడనక్కర్లేదని, పారిశ్రామిక విప్లవంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినా, మానవాళి ముందుకే సాగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశీయంగా ప్రతి గ్రామంలోనూ 5జీ నెట్వర్క్ ఉందని, మిగతా ఏ దేశంతో పోలి్చనా మెరుగ్గా, చౌకగా 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
మార్కెట్తోనే సంపద సాధ్యం: ల్యారీ ఫింక్: రాబోయే రోజుల్లో పది సంవత్సరాలకు పైగా భారత్ ఏటా 8–10 శాతం వృద్ధి చెందుతుందని, ఇది భారత్ శకం అని గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ చైర్మన్ ల్యారీ ఫింక్ చెప్పారు. భారతీయులు డబ్బంతా బ్యాంక్ డిపాజిట్లలోనే ఉంచకుండా క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికానే నిదర్శనమని ఫింక్ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో దేశీయంగా మ్యుచువల్ ఫండ్స్ ఏయూఎం ప్రస్తుత రూ. 80 లక్షల కోట్ల నుంచి రెట్టింపు స్థాయికి పెరుగుతుందని జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ కేవీ కామత్ చెప్పారు. టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు.
Tags : 1