KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
Published on Wed, 02/04/2026 - 09:25
2026 మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చిన చిరంజీవి.. చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన హిట్ కొట్టారు. జనవరి చివరి రోజున చిరు మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలలు(మగబిడ్డ, ఆడబిడ్డ) పుట్టారు. రెండు మూడు రోజుల క్రితం ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. అదే టైంలో చిరు గతంలో 'మెగా వారసుడి' అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. వీటిపై మెగాకోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ)
మెగా కుటుంబంలో ఇప్పటి జనరేషన్‌లో దాదాపు అందరూ అమ్మాయిలే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన చిరు.. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్న కొందరు.. ఆడపిల్లలు, మహిళలని చిరంజీవి చులకనగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లావణ్య.. ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదని ఒక యూజర్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది.
'సాధారణంగా ఇలాంటి ట్వీట్లని పట్టించుకోకుండా వదిలేస్తాను. ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలోని మహిళలని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో.. ఈ విమర్శలు చేసేవారికి అసలు అవగాహన లేదు. చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలామందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వంపై వ‍్యాఖ్యలు చేయడం సరికాదు' అని లావణ్య ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ చేసిన కాసేపటికే.. సదరు యూజర్ తన ట్వీట్ డిలీట్ చేశాడు.
(ఇదీ చదవండి: 2026పై నెట్‌ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్‌లా?)
Tags : 1