పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది
Breaking News
టాప్‌గేర్‌లో ఆటో సేల్స్
Published on Tue, 02/03/2026 - 09:17
జీఎస్‌టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకొని ప్రముఖ ఆటో సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, హ్యుందాయ్ మోటార్‌లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జనవరిలో 1,74,529 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే ఏడాది అమ్ముడైన 1,73,599 వాహనాలతో పోలిస్తే 0.50% అధికంగా ఉన్నాయి. విదేశాలకు చేసిన ఎగుమతులు(51,020), ఇతర సంస్థలకు అమ్మకాలు(7,643) కలిపి మొత్తం విక్రయాలు 2,36,963 యూనిట్లుగా నమోదయ్యాయి.
‘మునుపెన్నడూ లేనంతంగా నెలవారీ ప్రాతిపదికన మొత్తం 2,36,963 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 9,000 నుంచి 10,000 బుకింగ్స్ నమోదవుతూ.., మొత్తం 2.78 లక్షలకు మించి బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వార్షిక ప్రతిపాదికన ఇవి 25% అధికం. కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ విక్టోరిస్ అయిదు నెలల్లో 50వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఉత్పత్తి కొరతపై స్పందిస్తూ..., కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీకి కొరత కష్టాలు తప్పవన్నారు.
టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ జనవరిలో మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 46% వృద్ధి నమోదైంది.
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా 63,510 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే అక్టోబర్ అమ్మకాలు 50,659 యూనిట్లతో పోలిస్తే ఇవి 25% అధికంగా ఉన్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 59,107 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జనవరిలో అమ్మిన 54,003 యూనిట్లతో పోలిస్తే ఇవి 9% అధికం.
టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల వృద్ధి 17% పెరిగి 26,178 నుంచి 30,630 యూనిట్లకు చేరింది.
రెనో ఇండియా డీలర్ల పంపిణీ 34% పెరిగి 3,715 యూనిట్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,780 యూనిట్లుగా ఉన్నాయి.
కియా ఇండియా వార్షిక అమ్మకాల వృద్ధి 10% పెరిగి 27,603 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘కొత్త ఏడాది (2026) ప్రోత్సాహకర ప్రారంభం కియా బ్రాండ్‌పై కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త తరం సెల్టోస్‌కు లభిస్తున్న సానుకూల స్పందన, సోనెట్‌కు కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్, అలాగే కారెన్స్ క్లావిస్, క్లావిస్ ఈవీ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ పరిశీలిస్తే కియా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో బలం, సమతుల్యతకు అద్దం పడుతుంది’’ అని కియా ఇండియా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు.
ఇదీ చదవండి: మార్కెట్లు జోరందుకుంటాయా?
Tags : 1