Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత
Breaking News
ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!
Published on Mon, 02/02/2026 - 11:33
ఈ రోజుల్లో చేసిన సాయాన్నిగుర్తించుకుని కృతజ్ఞత చూపించడం అత్యంత అరుదు. ఒక వేళ ఆయా వ్యక్తులు తారసపడిన ముఖం చాటేస్తుంటారు చాలామంది. కానీ ఈ జంట ఎప్పుడో చేసిన వైద్యుడి సాయాన్ని గుర్తించుకోవడం కాదు, అతడు తారసపడిన వెంటనే చేసిన పనికి ఆ డాక్టర్ సైతం కంగుతిన్నాడు, ఆనందపారవశ్యంలో మునిగిపోయాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఆ వైద్యుడు నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..ఆఫ్రికన్ డాక్టర్ ఇద్రిస్ తాహిర్‌కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. ఆ సాయంత్రం ఒక రెస్టారెంట్‌లో చేసిన భోజనం తానొక గొప్ప జ్ఞాపకంగా మిగలనుందని అతడి ఆ సమయంలో తెలియదు. ఒక రోజు సాయంత్రం డాక్టర్ ఇంద్రిస్ ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ డైనింగ్ టేబుల మీద ఇద్దరు బ్యూటివఫుల్ ట్విన్స్‌తో ఉన్న జంటను చూస్తాడు. ఆ కవలలను చూసి ఆ వైద్యుడుకి చాలా ముచ్చటేస్తుంది.
ఆ తర్వాత వాళ్లంతా తమకు నచ్చిన ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తినడం జరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడు డిన్నర్ పూర్తి అవ్వగానే బిల్లు పే చేద్దామని వెళ్తుండగా కవలల తండ్రి ఆపి తాను బిల్లు పే చేశానని చెబుతాడు. దాంతో తాహిర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఎవరతను తన బిల్లు ఎందుకు కట్టాడని కన్ఫ్యూజన్‌లో ఉండగా..ఆ జంట డాక్టర్ గారు..మీరు మమల్ని గుర్తుపట్టలేదని అర్థమైంది.
ఐదు నెలలు క్రితం తాను తన భార్య ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చామని, అక్కడ తన భార్యకు కవలలను ప్రసవించేలా సాయం చేసింది మీరేనని వివరిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ డాక్టర్‌కి ఏం మాట్లాడలేక ఆ దంపతులు చూపిన కృతజ్ఞతకు ఆనందంతో తడిసి ముద్దవుతాడు. అస్సలు ఈ సాయంత్రం డిన్నర్ ఇంతలా తన జీవితంలో ఓ గొప్ప మరుపురాని జ్ఞాపకంగా ఉంటుందని ఊహించలేదు అంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నెటిజన్లు సైతం వృత్తిలో ఆ డాక్టర్ చూపిస్తున్న నిబద్ధతకు అంతా ప్రశంసించడమే కాదు..సేవకు దక్కుతున్న గౌరవం అది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.
I saw a couple at a restaurant with their beautiful twins. Just as I was about to pay my bill, the husband insisted he’d already taken care of it. He said, “You probably won’t recognize me, but you’re the one who operated on my wife five months ago, those are the twins you…
— Idris Tahir (@Idrees_taheer) February 1, 2026
(చదవండి: ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..)
Tags : 1