కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్
Breaking News
నాలుగేళ్లు ఒత్తిడిలోనే ఉన్నాను: శ్రుతి హాసన్
Published on Mon, 02/02/2026 - 07:03
నటి శ్రుతిహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అంతే కాకుండా సినిమా విక్కీపీడియాగా పేర్కొనే నటుడు కమలహాసన్, సారికల వారసురాలు అనే చిరునామా కలిగిన నటి ఈ బ్యూటీ. ఇక ప్రేమ వ్యవహారంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన ఈ భామ ఇటీవలే 40వ పుట్టిన రోజును జరుపుకున్నారు. శ్రుతిహసన్ నాయకిగా తమిళంలో నటించిన ట్రెయిన్ చిత్రం విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన, గాయని, సంగీతం, రచన అంటూ పలు రంగాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తాను చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన తల్లిదండ్రులతో పెరిగడమే ఇందుకు కారణం అన్నారు. 2018 నుంచి కొన్ని కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తానెవరు అన్నది పునః పరిశీలంచుకోవడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు.
తాను పలు ఏళ్లుగా చాలా ఒత్తిడితోనే బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ ఒత్తిడి కారణంగా ఆయా పరిస్థితుల కనుగుణంగా పయనించలేకపోయానని చెప్పారు. తన విరామ కాలాన్ని లండన్‌లో గడిపానని, ఆ సమయంలో తన వంట తనే చేసుకున్నానని, తన బట్టలు తానే ఉతుక్కున్నానని, మెట్రో రైలులో పయనించానని, సంగీతం సాధన చేశానని చెప్పారు. ప్రస్తుతం ఒక కళాకారిణిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.అది ఆనందాన్ని కలిగిస్తోందని, ఇకపై చాలెంజ్‌తో కూడిన కథా పాత్రల్లో నటించడానికి ప్రాముఖ్యతనిస్తానని శ్రుతిహాసన్ అన్నారు.
Tags : 1