ఇక ఇండియన్‌ ఐటీ పరిశ్రమదే కీలక పాత్ర

Published on Sun, 02/01/2026 - 19:36

కేంద్ర బడ్జెట్‌ 2026లోని ప్రతిపాదనలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధన–అభివృద్ధిపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని వారు ప్రశంసించారు.

సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా భారత్‌
కేంద్ర బడ్జెట్‌ 2026 భారతదేశాన్ని విశ్వసనీయ సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా నిలబెడుతుంది. సుపరిపాలన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వం ప్రాధాన్యంగా గుర్తించడం ప్రోత్సాహకరం. ఇది ఆవిష్కరణ, సమర్థత, స్కేలబుల్ డిజిటల్ పరిష్కారాలను అందించడంలో భారతీయ ఐటీ పరిశ్రమ పాత్రను బలోపేతం చేస్తుంది. ఇండియాఏఐ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫండ్, అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 వంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు సిద్ధమైన దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.
— అతుల్ సోనేజా, సీఓఓ, టెక్ మహీంద్రా

క్రిప్టో రంగానికి దీర్ఘకాలిక లాభం
భవిష్యత్తు సాంకేతికతల పట్ల కేంద్ర బడ్జెట్‌ స్పష్టమైన నిబద్ధతను చూపుతోంది. ఇండియాఏఐ మిషన్‌కు రూ.2,000 కోట్లు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రూ.500 కోట్లు కేటాయించడం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. క్రిప్టో రంగానికి ఇది తక్షణ ధరల ప్రభావం కన్నా, బలమైన ఆర్ & డి, టాలెంట్ అభివృద్ధి, నియంత్రిత, ఇండియా-ఫస్ట్ వినియోగాల నిర్మాణానికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తుంది. బ్లాక్‌చెయిన్ ఎంటర్‌ప్రైజ్ స్వీకరణకు, సురక్షిత ఆర్థిక మౌలిక సదుపాయాలకు కీలకమవుతుంది.
— విక్రమ్ సుబ్బూరాజ్, సీఈఓ, జియోటస్.కామ్

తెలంగాణ లైఫ్ సైన్సెస్ వృద్ధికి ఊతం
కేంద్ర బడ్జెట్‌ లైఫ్ సైన్సెస్ రంగంపై చూపుతున్న దృష్టి తెలంగాణలో వృద్ధికి మరింత ఊతమిస్తుంది. లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30లో పేర్కొన్న అధునాతన తయారీ, ఆవిష్కరణలు, ఆర్ & డి లక్ష్యాలు ఈ బడ్జెట్‌తో మరింత వేగం పొందనున్నాయి. దీని ద్వారా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాలు సాధ్యమవుతాయని, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ స్థానం బలపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
— శక్తి ఎం. నాగప్పన్, సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్

Videos

ప్రశ్నిస్తే ఇళ్లు తగలబెడతారా.. ఈ నిప్పే మీ ప్రభుత్వాన్ని దహిస్తుంది

అంబటి ఇంటికి భద్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

బడుగు జీవికి.. భరోసా లేని బడ్జెట్

మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు

దాడి తర్వాత.. ఇంటిని పరిశీలించిన జోగి రమేష్

అంబటిపై దాడి.. బైరెడ్డి నెక్స్ట్ లెవల్ వార్నింగ్

ఏపీలో రాషపతి పాలన..! వెంటనే కేంద్ర బలగాలను దింపండి..

APకి గుండు సున్నా.. చంద్రబాబు పరపతి ఉత్తదే!

KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం

పాక్ పై భారత్ ఘన విజయం

Photos

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)

+5

జనవరి ఇలా గడిచింది.. రుక్మిణి వసంత్ పోస్ట్ (ఫొటోలు)

+5

పూల చీరలో అనుపమ పరమేశ్వరన్ హొయలు (ఫొటోలు)

+5

తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)

+5

సిట్‌ విచారణకు కేసీఆర్‌.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)