'ప్రేమికుల దినోత్సవం' నాడు ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమా

Published on Sat, 01/31/2026 - 15:25

నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడు నటించిన తాజా చిత్రం ఎల్‌ ఐ కే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ). ఈయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నీ ఒకదానికి మించి ఒకటి సంచలన విజయాలు సాధించాయనేది తెలిసిందే. ఇటీవల విడుదలైన డ్యూడ్‌ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతోపాటు ప్రారంభమైన మరో చిత్రమే ఎల్‌ఐకే. కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.  సెవెన్‌ స్క్రీన్స్‌ స్టూడియో, రౌడీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు విఘ్నేష్‌ శివణ్‌ తెరకెక్కించారు.అనిరుధ్‌ సంగీతాన్ని అందించారు. 

అయితే, ముందుగా ఈ చిత్రాన్ని గత దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు  నిర్మాతల వర్గం ప్రకటించింది. కానీ, అదే సమయంలో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన డ్యూడ్‌ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో ఎల్‌ఐకే చిత్ర విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12 లేదా 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఫాంటసీ లవ్‌ కథాంశంతో  రూపొందిన ఈ చిత్ర షూటింగ్‌ను మలేషియా, సింగపూర్‌లో అధిక భాగాన్ని చిత్రీకరించినట్లు  యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా వరుస విజయాలతో జోరుపై ఉన్న నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపైన మంచి అంచనాలే నెలకొంటున్నాయి.

Videos

10 గంటలు.. 2000 మంది.. ప్రధానికి కంప్లైంట్ ఇస్తే..! అడ్వకేట్ సంచలన నిజాలు

అంబటిని ఏం చేయాలో..! లోకేష్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్

పార్టీ అండగా ఉంటుంది.. ఫోన్ లో జగన్ భరోసా!!

గల్లా మాధవి భర్త అంబటిని హత్య చేయాలని..! ఇవిగో ఆధారాలు

అర్ధరాత్రి 11 గంటలకు అంబటి అక్రమ అరెస్ట్

సుత్తులతో గోడలు బద్దలు కొడుతూ అంబటి ఆఫీసుకు నిప్పు

మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందం.. ఉపాసనకు ట్విన్స్ (ఫోటోలు)

EXCLUSIVE Video: 2000 మంది గూటీడీపీలతో ఎమ్మెల్యే గల్లా మాధవి విధ్వంసం

Guntur: అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి కారు.. ఫర్నీచర్ ధ్వంసం

పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నం

Photos

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంద‌డి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)