Breaking News

అమ్మానాన్న ఏడ్చేశారు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా

Published on Fri, 01/30/2026 - 16:01

ఒకప్పటి చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సారా అర్జున్‌ బాలీవుడ్‌ మూవీ 'ధురంధర్‌'తో హీరోయిన్‌గా మారింది. యలీనా జమైల్‌ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

ఆరోజు మర్చిపోలేను
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్‌ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్‌ అయ్యాక పేరెంట్స్‌ రియాక్షన్‌ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్‌ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్నాను. 

ధురంధర్‌
అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ధురంధర్‌ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.

చదవండి: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి  మూవీ.. ఎక్కడంటే?

Videos

CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం

Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!

Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు

Chitoor: స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ 30 మంది విద్యార్థులకు గాయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?

దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు

Photos

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)

+5

పారిస్ వీధుల్లో సందడిగా హీరోయిన్ 'స్నేహ' ఫ్యామిలీ (ఫోటోలు)

+5

ఉయ్యూరు : నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం (ఫొటోలు)

+5

బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్‌ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)

+5

రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)