Breaking News

హార్డ్‌వర్క్‌ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..!

Published on Fri, 01/30/2026 - 12:49

లైఫ్‌లో ఒకానొక టైంలో కష్టపడకపోతే..మనల్ని ఎవ్వరు రక్షించలేరు అన్నది జగమెరిగిన సత్యం. మన పెద్దలు కూడా వయసులో ఉన్నప్పడు ఏదైనా సంపాదించగలం,  ఆ తర్వాత మనతరం కాదు అని అంటుంటారు. అలాగే కష్టబడి డిగ్రీలు చదివి..ఉద్యోగం సంపాదించక హమ్మయ్యా అనేస్తాం. కానీ అక్కడి నుంచే మన అభివృద్ధి, ఎదుగుదల మొదలవ్వుతుంది. అలాకాకుండా..చతికిలపడితే అంతే పరిస్థితి అంటూ నెట్టింట షేర్‌ చేసిన పోస్ట్‌ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక ఆలోచింపచేసేలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

26 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి నందిని శర్మ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా గొప్ప కెరీర్‌ ​పాఠాన్ని షేర్‌ చేశారు. టీనేజ్‌ చివరలో.. 20ల ప్రారంభంలో ఉన్నవారికి ఉపయోగపడే అధ్బుతమైన కెరీర్ సలహాలను ఇచ్చారామె. కార్పోరేట్‌ లైఫ్‌ వాస్తవికంగా ఎలా ఉంటుందనేది ఒక్క మాటలో చెప్పేశారామె. కెరీర్‌ ప్రారంభ సవంత్సరాల్లో అందరి దృష్టి డబ్బు పైనే ఫోకస్‌ ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా విజయపరంపరతో జాబ్‌లో దూసుకోవడం అనేది ఎప్పటికీ శక్తిమంతమైనదని నొక్కి చెప్పారు. 

అది ఇరవైలలోనే సాధ్యమని అప్పుడే మంచిప్రయోజనం పొందగలమని అన్నారు. ఎందుకంటే అప్పటికీ ఎలాంటి కుటుంబ ఒత్తిళ్లు, బాధ్యతలు ఉండవు, పైగా వారివద్ద చాలా సమయం ఉంటుంది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యక్తిగత డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌ పెడితే రానురాను కష్టం అనే మాటే ఉండదని అన్నారు. ఇలాంటి ధోరణితో ఉంటే గనుక రిస్క్‌ తీసుకునేందుకు భయపడరు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. 

మనం ఫ్రీగా ఉన్న టైంలోనే కష్టపడేందుకు ఆసక్తి చూపాలి..అప్పుడే మన కెరీర్‌ ఉన్నతంగా ఉంటుంది..అలాగే ఈ కార్పొరేట్‌ లైఫ్‌లో మన మనుగడ సాధ్యమని నొక్కి చెప్పారామె. లేదంటే మనల్ని కాపాడే వారెవ్వరూ లేరు అని గుర్తించుకోండి అని అన్నారామె. తాను మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నప్పటికీ..తన కెరీర్‌, ఫిట్‌నెస్‌ లక్ష్యాలు, సాధించాల్సిన ఆశయాలను ఎప్పటికీ గుర్తించుకుంటానని అన్నారు. 

అంతేగాదు తన విజయవంతమైన కెరీర్‌ జర్నీని డాక్యమెంట్‌​ చేయాలని భావిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఐటీలో పనిచేస్తూ కెరీర్‌పై ఎన్నో కలలతో ఉన్నవాళ్లకు ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ తన పోస్ట్‌ని ముగించారు శర్మ. కష్టే ఫలి అంటే ఇదేగదూ.! అంతేగాదు నెటిజన్లు సైతం ఇది ముమ్మాటికీ నిజం. ఎవ్వరికీ మన సమ​స్యను పట్టించుకునేంత సమయం లేదు. అందరూ వారివారి సమస్యలతో వాళ్లు బిజీగా ఉన్నారని కొందరూ. మరికొందరూ డెవలప్‌మెంట్‌ అనేది ఉద్యోగ ఆఫర్‌తో ముగిసిపోదని అక్కడ నుంచే ప్రారంభమని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?)

 

 

Videos

CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం

Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!

Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు

Chitoor: స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ 30 మంది విద్యార్థులకు గాయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?

దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు

Photos

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)

+5

పారిస్ వీధుల్లో సందడిగా హీరోయిన్ 'స్నేహ' ఫ్యామిలీ (ఫోటోలు)

+5

ఉయ్యూరు : నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం (ఫొటోలు)

+5

బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్‌ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)

+5

రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)