Breaking News

వింగ్స్‌ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం

Published on Fri, 01/30/2026 - 08:18

రష్యాకి చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్‌ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ఫౌండర్‌ శుభకర్‌ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్‌–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.

ఈ విమానాలను పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్‌ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్‌ వివరించారు.


ఇండో–పసిఫిక్‌ ఏవియేషన్‌కి అవార్డు

జెట్‌సెట్‌గో అనుబంధ సంస్థ ఇండోపసిఫిక్‌ ఏవియేషన్‌కి ‘బెస్ట్‌ ఎన్‌ఎస్‌వోపీ–ఫిక్సిడ్‌ వింగ్స్‌’ పురస్కారం దక్కింది. నాన్‌–షెడ్యూల్డ్‌ ఏవియేషన్‌ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరుకు గాను సంస్థ ఈ అవార్డును దక్కించుకుంది. వింగ్స్‌ ఇండియా 2026 కార్యక్రమం సందర్భంగా జెట్‌సెట్‌గో ఫౌండర్‌ కనికా టేక్రివాల్‌కి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు పురస్కారాన్ని అందజేశారు. రెండోసారి ఈ అవార్డును దక్కించుకోవడమనేది కచ్చితత్వానికి, భద్రతకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని కనిక తెలిపారు.

ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

#

Tags : 1

Videos

CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం

Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!

Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు

Chitoor: స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ 30 మంది విద్యార్థులకు గాయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?

దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు

Photos

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)

+5

పారిస్ వీధుల్లో సందడిగా హీరోయిన్ 'స్నేహ' ఫ్యామిలీ (ఫోటోలు)

+5

ఉయ్యూరు : నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం (ఫొటోలు)

+5

బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్‌ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)

+5

రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)